ETV Bharat / entertainment

Allu Arjun Pushpa: ఒడిశా అడవుల్లో 'పుష్ప'రాజ్​.. పార్ట్​-3కి స్టోరీ రెడీ! - పుష్ప 2 షూట్​

అల్లు అర్జున్​, సుకుమార్​ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్​ మూవీ పుష్ప పార్ట్​ 2. ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఓ లేటెస్ట్ న్యూస్​ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే?

pushpa 3 update
pushpa 3 update
author img

By

Published : Apr 20, 2023, 10:54 AM IST

టాలీవుడ్​ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లీడ్​ రోల్​లో సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'పుష్ప ద రూల్'. 'పుష్ప-1'కు సీక్వెల్​గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్​ శరవేగంగా జరుపుకుంటోంది. పాన్ ఇండియా లెవెల్​లో రిలీజ్​కు రెడీ అయ్యేందుకు సిద్ధం కానుంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, వేర్​ ఈజ్​ పుష్ప వీడియో ప్రేక్షకులను మెస్మరైజ్​ చేశాయి. ఈ రెండింటితో ఈ సినిమాల గురించి అభిమానుల్లో భారీ అంచనాలే ఏర్పాడ్డాయి. వీడియోతో పాటు పోస్టర్​తో ఇచ్చిన హింట్స్​తో మొదటి పార్ట్​ కంటే ఈ రెండు పార్ట్​ ఇంకా ఆసక్తికంగా ఉంటుందని ఫ్యాన్స్​ అంటున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు.

అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్​ సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం భారీ షెడ్యూల్​ నడుమ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రానున్న ఏడాది రిలీజ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా సినీ వర్గాల ప్రకారం..ఈ మూవీకి సీక్వెల్​గా పార్ట్ 3 కూడా రానున్నట్లు టాక్​ నడుస్తోంది. సుకుమార్​ ఇప్పటికే స్టోరీ రెడీ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ ​నుంచి అఫీషియల్​గా ఎటువంటి అనౌన్స్​మెంట్​ రాలేదు.

మల్కన్​గిరి అడవుల్లోకి పుష్పరాజ్​ ఎంట్రీ..
'పుష్ప' మెదటి భాగంలో కనిపించిన ఫైట్​ సీన్స్ ఆ సినిమాకే హైలైట్​గా నిలిచాయి. ఆ సీన్స్​ అన్నింటిని ఆంధ్రప్రదేశ్​లోని మారేడుమిల్లి ఫారెస్ట్​లో షూట్​ చేశారు. అయితే ఈ సారి 'పుష్ప 2'లోని ఫైట్​ సీన్స్​ను ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు జిల్లా అయిన మల్కన్‌గిరిలోని కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకుని అక్కడ 'పుష్ప 2' షూటింగ్ జరుపుతున్నారు. ఇప్పటికే ఈ షూట్​ కోసం మూవీ టీమ్​ అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలో హీరో అల్లు అర్జున్ కూడా మల్కన్‌గిరి చేరుకున్నారు. ఆయన ఆ అడవుల్లో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో తీసిన ఫొటోలు సోషల్​ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

అయితే ఈ షూట్​ కోసం మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ మేనేజర్ పి.వెంకటేశ్వరరావుతో పాటు యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్, ప్రొడక్షన్ డిజైనర్ రామకృష్ణ తదితరులు మల్కన్‌గిరి జిల్లాలోని సరుకుబంధ హ్యాంగింగ్ బ్రిడ్జ్‌ హంటలగూడతో పాటు ఆ చుట్టుపక్కల లొకేషన్లను పరిశీలించారు. అలాగే, షూటింగ్ కోసం జిల్లా కలెక్టర్, ఎస్పీ అనుమతులు కూడా తీసుకున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​ నిర్మిస్తున్న ఈ సినిమాలో నేషనల్​ క్రష్​ రష్మిక మందన్న హీరోయిన్​గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహాద్​ ఫాజిల్​, టాలీవుడ్​ స్టార్స్​ సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.​ రాక్​స్టార్​ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.