ETV Bharat / entertainment

మెగాస్టార్​ గ్యారేజీలోకి కొత్త లగ్జరీ కారు.. ధర తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే! - మెగాస్టార్​ చిరంజీవి టొయోటా కారు

టాలీవుడ్​ మెగాస్టార్​ చిరంజీవి ఇటీవలే ఓ కొత్త కారు కొన్నారట. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్​ను సైతం చేసుకున్నారట.

chiranjeevi-buy-toyota-vellfire-car
chiranjeevi-buy-toyota-vellfire-car
author img

By

Published : Apr 12, 2023, 3:51 PM IST

Updated : Apr 12, 2023, 4:50 PM IST

టాలీవుడ్​ మెగాస్టార్​ చిరంజీవి గ్యారేజ్​లో అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటిలోకి మరో కొత్త కారు చేరింది. అదే అత్యాధునిక టెక్నాలజీ కలిగిన లగ్జరీ కారు టొయోటా వెల్‌ఫైర్‌. రీసెంట్​గానే ఆయన ఈ కారును కొన్నట్లు సమాచారం. ఎంతో హుందాగా ఉండే ఈ కారు విలువ సుమారు 1.9 కోట్ల రూపాయలట.

బ్లాక్‌​ కలర్‌లో ఉన్న ఈ కారు రిజిస్ట్రేషన్‌ కోసం చిరంజీవి మంగళవారం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి.. కొణిదెల చిరంజీవి అనే పేరుతో వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారట. రూ.4.70 లక్షలు పెట్టి ఆ వాహనానికి ఆయన TS09GB1111 అనే నంబర్​ను తీసుకున్నారట. ఈ మేరకు ఆర్టీఏ ఆఫీసులో ఫొటో, డిజిటల్‌ సంతకం తదితర ప్రక్రియను పూర్తి చేశారట. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

టయోటా వెల్‌ఫైర్‌ ప్రత్యేకత
చిరంజీవి కొన్న టయోటా వెల్‌ఫైర్‌ వాహనం విషయానికి వస్తే ఆ కారులో మూడు వరుసలు ఉంటాయి. ఏడుగురు దర్జాగా కూర్చొని షికారుకు వెళ్లవచ్చు! భద్రత కోసం ఏడు ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండటం విశేషం. ఎలక్ట్రిక్‌ స్లైడింగ్‌ డోర్స్‌ మరో ప్రత్యేకత. ట్విన్‌ సన్‌రూఫ్‌, 13 అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్‌ స్క్రీన్స్‌ వంటి మరిన్ని స్పెషాలిటీస్‌ ఈ వాహనం సొంతం.

కాగా, చిరంజీవి ప్రస్తుతం మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్‌ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో చిరు చెల్లిగా కీర్తి సురేశ్​ నటిస్తున్నారు. అయితే అప్పట్లో ఈ సినిమాను ఏప్రిల్‌ 14న విడుదల చేసేందుకు ప్లాన్​ చేశారు. కానీ షూటింగ్‌ ఆలస్యం అవ్వడం వల్ల ఆగస్టు 11న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే చిరంజీవి.. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆచార్య సినిమాతో ఫ్లాప్​ అందుకున్న చిరు.. వీరయ్యతో సూపర్​ హిట్​ సాధించారు.

రజనీని డైరెక్ట్​ చేయనున్న బాబీ!
చిరంజీవికి వాల్తేర్ వీరయ్యలాంటి సూపర్ డూపర్ హిట్ అందించిన దర్శకుడు బాబీ కొల్లి.. రజనీకాంత్ మూవీతో కోలీవుడ్​లోనూ అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే ఆయన ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ తయారు చేసినట్లు సమాచారం. ఆ స్క్రిప్ట్​ను త్వరలోనే రజనీకాంత్ ముందు బాబీ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్​కు సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే బయటకు రానుంది. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్​తో రూపొందించనున్నారట.

Last Updated : Apr 12, 2023, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.