ETV Bharat / entertainment

NTR స్టైలిష్ లుక్‌ అదిరిందంతే.. స్పెషలేంటో మరి? - NTR new movies

స్టైలిష్‌ క్రాఫ్‌, గడ్డం, గాగుల్స్​తో జీన్స్ ట్రౌజర్‌ వేసుకుని కెమెరాకు ఫోజులిచ్చారు టాలీవుడ్​ స్టార్​ హీరో జూనియర్​ ఎన్టీఆర్​. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

tollywood hero junior ntr latest picture viral

author img

By

Published : Nov 11, 2022, 9:31 PM IST

NTR New Look: అభిమానుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పుటికప్పుడు మేకోవర్‌ మార్చుకుంటూ 'టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌'గా నిలిచే హీరోల్లో టాప్‌లో ఉంటారు జూనియర్‌ ఎన్టీఆర్‌. సినిమాలతో ఎంటర్‌టైన్‌ చేయడమే కాదు.. ఆఫ్‌ స్క్రీన్‌ లుక్‌లో కూడా అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తుంటారు. ఇటీవలే 'ఆర్‌ఆర్ఆర్‌' జపాన్‌ రిలీజ్ సందర్భంగా ట్రెండీ స్టైలిష్ లుక్‌లో కనిపించి ఔరా అనిపించారు. తాజాగా ఎవరూ ఊహించని లుక్‌తో అందరినీ మెస్మరైజ్‌ చేస్తున్నారు ఎన్టీఆర్‌.

స్టైలిష్‌ క్రాఫ్‌, గడ్డం, గాగుల్స్​తో జీన్స్ ట్రౌజర్‌ వేసుకుని కెమెరాకు ఫోజులిచ్చారు తారక్‌. ఎన్టీఆర్ అద్దంలో తనను తాను చూసుకుంటుంటే.. వెనకనున్న హెయిర్ స్టైలిష్ట్​ ఆ దృశ్యాన్ని సెల్‌లో బంధించారు. కొత్త రోజు, కొత్త వైబ్స్ అనే క్యాప్సన్​తో తారక్‌ న్యూ లుక్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో కలిసి 'NTR 30' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

tollywood hero junior ntr latest picture viral
జూనియర్​ ఎన్టీఆర్​

జనతా గ్యారేజ్‌ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా కోసం తారక్‌ మేకోవర్ మార్చుకునే పనిలో ఉన్నట్టు ఇప్పటికే చాలా వార్తలు తెరపైకి వచ్చాయి. మరి తారక్‌ న్యూలుక్‌ 'NTR 30' కోసమేనా? లేదంటే కమర్షియల్ యాడ్ కోసమా? అనేది తెలియాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.