ETV Bharat / entertainment

ఈ వారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే.. - vishwak sen new movie ashoka vana lo arjuna kalyanam

బాక్సాఫీస్‌ వద్ద వేసవి సినిమాల సందడి కొనసాగుతోంది. ప్రతి వారం కచ్చితంగా ఓ సరికొత్త సినిమా ప్రేక్షకులను పలకరిస్తోంది. మరి జూన్‌ మొదటి వారంలో అలరించే చిత్రాలేవో చూసేద్దామా!

ఈ వారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే..
Telugu Movies
author img

By

Published : May 31, 2022, 11:36 AM IST

Updated : May 31, 2022, 2:13 PM IST

మొదటి నుంచి విభిన్న చిత్రాలు, కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు అడవి శేష్‌. ఇప్పుడు 'మేజర్‌'తో థియేటర్‌లలో సందడి చేసేందుకు వస్తున్నారు. 26/11 ఉగ్రదాడుల్లో పౌరుల ప్రాణాలను కాపాడుతూ అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సయీ మంజ్రేకర్‌, శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించారు. జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల కానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో అతికొద్ది మందికోసం ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు.

major
మేజర్​

సింహం.. పులి.. చిరుత.. ప్రకృతి

విలక్షణ నటులందరినీ ఒకే తెరపై చూపించటం అంటే సాహసమనే చెప్పాలి. ఎందుకంటే దానికి తగినట్లు కథ, పాత్రల్లో బలం లేకపోతే సినిమా తేలిపోతుంది. కానీ, తమిళ దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ ఆ అడ్వెంచర్‌ చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో కమల్‌హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, కీలక పాత్రల్లో నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'విక్రమ్‌'. సూర్య అతిథి పాత్రలో మెరవబోతున్నారు. ఇంతటి క్రేజ్‌ ఉన్న ఈ సినిమా జూన్‌ 3న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇక అనిరుధ్‌ రవిచందర్‌ అందించిన నేపథ్య సంగీతం హైలైట్‌ అని చెప్పవచ్చు. ఇందులో సింహం(విజయ్‌ సేతుపతి) పులి(ఫహద్‌ ఫాజిల్‌) చిరుత(?) మధ్య జరిగిన ఘర్షణ ఏంటి? అందులో ప్రకృతి(కమల్‌హాసన్‌) సృష్టించిన ప్రళయం ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

vikram
విక్రమ్‌

పృధ్వీరాజ్‌ చౌహాన్‌ జీవిత కథ

అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో మానుషి కథానాయికగా రూపొందుతున్న చిత్రం 'సమ్రాట్ పృధ్వీరాజ్‌'. చంద్రప్రకాశ్‌ ద్వివేది తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు.. పలు దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. రాజ్‌పూత్‌ యోధుడు పృధ్వీరాజ్‌ చౌహాన్‌ వీరగాథ ఆధారంగా తీసిన ఈ సినిమాను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. సంజయ్‌దత్‌, సోనూసూద్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.

prudhvi raj chouhan
సమ్రాట్ పృధ్వీరాజ్‌

ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలివే!

థియేటర్‌లో అలరించి..

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా విద్యా సాగర్‌ చింతా తెరకెక్కించిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'అశోకవనంలో అర్జున కల్యాణం'. చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెలుగు ఓటీటీ 'ఆహా'లో జూన్‌ 3 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. రుక్సార్‌ థిల్లాన్‌, రితికా నాయక్‌ నాయికలుగా మెరిసి, విశేషంగా ఆట్టుకున్నారు. గోపరాజు రమణ, కేదార్‌ శంకర్‌, కాదంబరి కిరణ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

ashoka vanamlo arjuna kalyanam
అశోకవనంలో అర్జున కల్యాణం

9 గంటల పాటు ఏం జరిగింది?

తారకరత్న, అజయ్‌, మధుశాలిని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ '9అవర్స్‌'. ప్రముఖ దర్శకుడు క్రిష్‌ అందించిన కథతో నిరంజన్‌ కౌశిక్‌, జాకబ్‌ వర్గీస్‌లు దర్శకత్వం వహించారు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌2వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. 'డెక్కన్‌ ఇంపీరియల్‌ బ్యాంక్‌'లో 9గంటల పాటు ఏం జరిగిందన్న ఆసక్తికర కథాంశంతో ఈ సిరీస్‌ తెరకెక్కించారు. వై.రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు.

9hours
9అవర్స్‌

నెట్‌ఫ్లిక్స్‌

  • జనగణమన (మలయాళం) జూన్‌ 2
  • సర్వైవింగ్‌ సమ్మర్‌ (వెబ్‌ సిరీస్‌) జూన్‌ 3
  • ద పర్‌ఫెక్ట్‌ మదర్‌ (వెబ్‌ సిరీస్‌) జూన్‌ 3

అమెజాన్‌ ప్రైమ్‌

  • ద బాయ్స్‌ (వెబ్‌ సిరీస్‌3) జూన్‌3

బుక్‌ మై షో

  • బెల్‌ఫాస్ట్‌ (హాలీవుడ్‌) జూన్‌3

ఎంఎక్స్‌ ప్లేయర్‌

  • ఆశ్రమ్‌ (హిందీ సిరీస్‌3) జూన్‌3

ఇదీ చదవండి: బికినీలో 'జగడం' బ్యూటీ.. స్విమ్మింగ్​పూల్​ వద్ద రెచ్చిపోయిన అమ్మడు

Last Updated : May 31, 2022, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.