ప్రముఖ తమిళ నటుడు విజయ్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. లోకేశ్ కనగరాజ్ యూనివర్స్(LCU)లో భాగంగా ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. 'విక్రమ్' సినిమాతో సంచలన విజయం అందుకున్న లోకేశ్.. ఇప్పుడు విజయ్ను డైరెక్ట్ చేయబోతున్నారు. 'దళపతి 67' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. క్రేజీ కాంబినేషన్లో వస్తున్న మూవీ గురించి ఓ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
లోకేశ్ తెరకెక్కించిన పాత చిత్రాల్లో ఉన్న క్యారెక్టర్లను.. తన ఎల్సీయూ చిత్రాల్లో ఆయన వాడుకోబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో కూడా హిట్ క్యారెక్టర్లను పెట్టబోతున్నట్టు సమాచారం. 'విక్రమ్' సినిమా చివర్లో 'రోలెక్స్' అనే పాత్రలో సూర్యను పరిచయం చేశారు లోకేశ్. అంతకముందు 'ఖైదీ' సినిమాలో 'ఢిల్లీ'గా కార్తీని పరిచయం చేశారు. అయితే ఈ పాత్రలు తన ఎల్సీయూ సినిమాల్లో వాడుకునేటట్లు రాసుకున్నారట.
అందుకే వాటిని ఇప్పుడు విజయ్ సినిమాకు వాడుకుంటారట. అయితే ఈ పాత్రలు వాడుకోవాలంటే రాజ్ కమల్ ప్రొడక్షన్స్, ఎస్ఆర్ ప్రభు నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్లు అనుమతిస్తే.. ఖైదీ, విక్రమ్ సినిమాల కథను కలుపుతారా?. విజయ్ నటించిన మాస్టర్ స్టోరీని పొడగిస్తారా? లేక సరికొత్తగా క్రియేట్ చేస్తారా అనేది వేచి చూడాల్సిందే.
'దళపతి 67' విషయానికొస్తే.. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. తమిళ నటుడు విశాల్, దర్శకుడు గౌతమ్ మీనన్, మాజీ క్రికెటర్ ఎమ్ఎస్ ధోనీ ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. త్రిష ఫీమేల్ లీడ్‌లో నటిస్తున్నారు. ఖైదీ నటులు నరైన్, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఇవీ చదవండి : గుడ్డూ భయ్యా ఎమోషనల్ పోస్ట్.. 'మీర్జాపూర్ 3' అప్డేట్.. దాన్ని మీరు నమ్మకపోవచ్చంటూ..