ETV Bharat / entertainment

Thalapathy vijay Leo movie : హీరో దళపతి విజయ్​పై కేసు! - లోకేశ్ కనగరాజ్​ విజయ్ దళపతి సినిమా

Thalapathy vijay Leo movie : కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్​పై కేసు నమోదైంది. ఆ వివరాలు..

Vijay Leo
Thalapathy vijay Leo movie : హీరో దళపతి విజయ్​పై కేసు
author img

By

Published : Jun 26, 2023, 2:57 PM IST

Updated : Jun 26, 2023, 3:56 PM IST

Thalapathy vijay Leo movie : కోలీవుడ్‌ స్టార్‌ హీరో దళపతి విజయ్‌- డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సరికొత్త చిత్రం 'లియో'. మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ సరసన త్రిష నటిస్తోంది. విజయ్‌- త్రిష కలిసి దాదాపు 14ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్​ సంజయ్‌ దత్‌, ప్రియా ఆనంద్‌, గౌతమ్ వాసుదేవ మేనన్‌, మిస్కిన్‌ వంటి నటీనటులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

రీసెంట్​గా ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా 'నా రెడీ' సాంగ్‌ ప్రస్తుతం యూట్యూబ్​లో ఫుల్ ట్రెండ్ అవుతోంది. అయితే ఇప్పుడిదే పాట మూవీటీమ్​ను చిక్కుల్లోకి నెట్టింది. ఈ సాంగ్​లో డ్రగ్స్​ వాడకం, రౌడీయిజాన్ని ఎక్కువగా చూపించారు. దీంతో చెన్నైలోని కొరుక్కుపెట్టాయ్(Korukkuppettai) ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త ఆర్‌టీఐ.సెల్వం కోర్టును ఆశ్రయించారు. హీరో విజయ్‌ దళపతి, మిగితా మూవీటీమ్​పై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. నార్కోటిక్‌ కంట్రోల్‌ యాక్ట్‌ కింద వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

LEO Na Ready song : నా రెడీ సాంగ్​ విషయానికొస్తే.. ఈ పాటను హీరో విజయ్-అనిరుధ్ రవిచంద్రన్ పాడారు. విష్ణు ఎడవన్.. లిరిక్స్ అందించారు. ఈ పాట ప్రారంభం నుంచి చివరి వరకు మాస్ బీట్‍తో అదిరిపోయింది. అచ్చం విజయ్ ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఉంది. ఈ సాంగ్‍లో నోట్లో బీడీతో విజయ్ మాస్ లుక్‍తో ఫ్యాన్స్​కు బాగా ఆకట్టుకుంది. భారీ సంఖ్యలో డ్యాన్సర్లతో ఈ సాంగ్​ను గ్రాండ్​గా రూపొందించారు. అలాగే విజయ్​ కూడా మాస్ స్టెప్పులతో అదరగొట్టారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

lokesh kanagaraj vijay new movie : 'మాస్టర్‌' తర్వాత విజయ్‌ - లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'లియో'. 7 స్క్రీన్‌ స్టూడియో పతాకంపై ఎస్‌.ఎస్‌ లలిత్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్​గా కశ్మీర్‌లో భారీ షెడ్యూల్‌ పూర్తి చేసుకుందీ చిత్రం. ప్రస్తుతం గత కొన్నిరోజుల నుంచి చెన్నైలో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. అక్టోబర్‌లో ఈ సినిమాను థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మూవీటీమ్​ సన్నాహాలు చేస్తోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది.

Leo movie first look : అంతకుముందు గురువారం జూన్​ 22న విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా 'లియో' ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. విజయ్‌ చేతిలో రక్తంతో తడిసిన సుత్తితో పాటు వెనకాల తోడేలు కనిపిస్తూ ఉన్న లుక్‌.. చిత్రం పై భారీగా అంచనాలను పెంచింది.

ఇదీ చూడండి :

'లియో' కశ్మీర్ షెడ్యూల్.. గడ్డ కట్టించే చలిలోనూ షూటింగ్.. స్పెషల్ వీడియో రిలీజ్​

రిలీజ్​కు ముందే రూ.400 కోట్ల బిజినెస్.. 'లియో' లెక్కలు చూస్తే మతి పోవాల్సిందే!

Last Updated : Jun 26, 2023, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.