ETV Bharat / entertainment

ఎన్టీఆర్​తో టీమ్​ఇండియా​ సందడి.. ఫొటో చూశారా? - టీమ్​ఇండియా న్యూజిలాండ్​ వన్డే

న్యూజిలాండ్​తో మ్యాచ్​ కోసం హైదరాబాద్​కు వచ్చిన టీమ్​ఇండియా.. జూనియర్​ ఎన్టీఆర్​ను కలిసి సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దాన్ని మీరు చూసేయండి..

Teamindia meet JR NTR in Hyderabad photo viral
టీమ్​ఇండియాతో ఎన్టీఆర్​ సందడి.. ఫొటో వైరల్​
author img

By

Published : Jan 17, 2023, 10:11 AM IST

Updated : Jan 17, 2023, 11:31 AM IST

సినీ తారలు-టీమ్​ఇండియా క్రికెటర్ల మధ్య అనుబంధం గురించి తెలిసిందే. పలు వేదికలపై కలిసి సందడి కూడా చేస్తుంటారు. కానీ సౌత్​ ఇండస్ట్రీలో ఇలాంటి కల్చర్​ అంతగా కనపడదు. అయితే ఇప్పుడు మన దక్షిణాది పరిశ్రమ.. తమ అద్భుతమైన సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. దీంతో మన హీరోల క్రేజ్​ బాగా పెరిగిపోయింది. మన కథానాయకులకు భారత క్రికెటర్లు కూడా ఫ్యాన్స్​గా మారిపోతున్నారు​.

అయితే ఇక విషయానికొస్తే.. 'ఆర్​ఆర్​ఆర్'​ ముందు వరకు సౌత్ ప్రేక్షకులకు మాత్రమే పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్.. ఆ సినిమా తర్వాత వరల్డ్ వైడ్​గా పాపులర్ అయిపోయారు. బాలీవుడ్​ సినీ సెలబ్రిటీల నుంచి హాలీవుడ్ తారలు మెచ్చుకునే స్థాయికి ఎదిగారు. ఈ క్రమంలోనే గతేడాది ఫ్యామిలీతో ఫారెన్​ వెకేషన్‌కు వెళ్లిన తారక్‌.. క్రిస్మస్‌, న్యూ ఇయర్​ వేడుకల్ని కూడా అక్కడే చేసుకున్నారు. ఆ తర్వాత నాటు నాటు సాంగ్​కు గోల్డెన్​ గ్లోబ్ అవార్డు వరించిన సందర్భంగా మూవీటీమ్​తో పాటు భార్యతో కలిసి అమెరికాలో జరిగిన వేడుకలో సందడి చేశారు. అయితే ఇప్పుడాయన స్వదేశానికి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చీ రాగానే ఆయన హైదరాబాద్​లో టీమ్​ఇండియాతో కలిసి దిగిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం భారత జట్టు హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత జట్టులోని పలువురు క్రికెటర్లు తారక్‌ను కలిసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్‌తో సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, చాహల్, శుభమన్​ గిల్‌, శార్దుల్​తో పాటు పలువురు ప్లేయర్లు ఉన్నారు. అయితే వీరు ఎక్కడ కలిశారన్నది మాత్రం స్పష్టత లేదు. వారి బ్యాక్‌గ్రౌండ్‌లో ఫుల్‌ లైటింగ్‌ సెట్‌, కార్లు కనిపిస్తున్నాయి.

కాగా, శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్‌ను దక్కించుకుని ఫుల్​ జోష్​లో ఉన్న టీమ్​ఇండియా.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. ముందుగా వన్డే సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్​ను హైదరాబాద్‌లోని ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా జనవరి 18 ఆడనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్​ చేరుకున్న భారత జట్టు ఎన్టీఆర్​ను కలిసినట్లు అర్థమవుతోంది. ఈ ఫొటో ప్రస్తుతం ఫుల్ ట్రెండ్ అవుతోంది.

Teamindia meet JR NTR in Hyderabad photo viral
టీమ్​ఇండియాతో ఎన్టీఆర్​ సందడి

ఇదీ చూడండి: మార్కెట్లో మన సినిమా పేరు మార్మోగిపోవాలా.. సరికొత్త ప్రచారంతో దుమ్మురేపుతున్న టాలీవుడ్‌

Last Updated : Jan 17, 2023, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.