ETV Bharat / entertainment

హీరో అజిత్​ అలా చేస్తారా.. ఆ సీక్రెట్ చెప్పేసిన త్రిష.. తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే!

author img

By

Published : Jan 4, 2023, 3:31 PM IST

కోలీవుడ్​లోనే కాదు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్‌ ఉన్న స్టార్ హీరో.. అజిత్. అయితే ఆయన గురించి ఓ సీక్రెట్​ చెప్పింది హీరోయిన్ త్రిష. అది తెలిస్తే మీరు తప్పకుండా షాక్ అవ్వాల్సిందే. అదేంటంటే..

Tamil star Ajith Didnt use the mobile phone says Tirsha
హీరో అజిత్​ అలా చేస్తారా.. ఆ సీక్రెట్ చెప్పేసిన త్రిష.. తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే!

ప్రస్తుతం ప్రతిఒక్కరి జీవితంలో సెల్​ ఫోన్​ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది లేకుండా ఏ పని జరగదు. ముఖ్యంగా సెలబ్రిటీలకైతే ఇది మరింత ముఖ్యమనే చెప్పాలి. వీటి ద్వారానే సోషల్​మీడియా అంటూ ఫ్యాన్స్​కు ఎప్పటికప్పుడు అప్డేట్స్​ ఇస్తూ వారికి దగ్గరవుతుంటారు. అయితే ఇంకా ఫోన్​ వాడని స్టార్స్​ ఉన్నారా అంటే? అవుననే చెప్పాలి. తమిళ స్టార్ హీరో అజిత్ ఈ జాబితాలోకే వస్తారు.

అసలు విషయానికొస్తే.. కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్‌ ఉన్న స్టార్ హీరో అజిత్. అభిమానులు ఈ తమిళ స్టార్​ను ముద్దుగా 'తల' అని పిలుస్తారు. మల్టీటాలెంటెడ్​ అయిన ఈ హీరో బయట కనిపించడం చాలా అరుదు అనే చెప్పాలి. అంతే కాకుండా ఎటువంటి సోషల్​ మీడియా హ్యాండిల్స్​ సైతం లేవు. ఎప్పుడూ సాదాసీదాగా కనిపించే ఈ హీరో సినిమా ఫంక్షన్లలకు సైతం తక్కువగానే హాజరవుతుంటారు. తన పర్సనల్​ లైఫ్​ గురించి అంతగా చెప్పుకోని ఈ స్టార్ గురించి తాజాగా తన కో స్టార్​ త్రిష ఓ సీక్రెట్​ రివీల్​ చేశారు. అదేందంటే.. ఆయన ఫోన్​ వాడరట.​ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన త్రిషతో ముచ్చటించిన యాంకర్​.. 'అజిత్ నంబర్‌ను ఏ పేరుతో సేవ్ చేశార'ని అడగగా.. ఈ విషయాన్ని చెప్పింది.

అజిత్​తో ఎప్పుడూ ఓ మేనేజర్​ ఉంటారట. ఆయనే అజిత్​కు సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటారట. అజిత్​ ఎవరితోనైనా మాట్లాడాలన్నా, లేదా అజిత్​తో ఎవరైనా మాట్లాడాలనుకున్న ఈయనే చూసుకుంటారట. అందుకే తల ప్రత్యేకంగా మొబైల్ ఫోన్ ఉపయోగించరట. మరో విషయం ఏంటంటే.. అజిత్ నటించే ప్రతి చిత్రానికి ఓ కొత్త సిమ్ కార్డ్‌ని తీసుకుంటారట. ఆ సినిమా విడుదలయ్యాక.. మరో కొత్త ప్రాజెక్ట్ మొదలవ్వగానే సిమ్ కార్డ్‌ను మార్చేస్తారట. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులో పనిచేసేటప్పుడు ఆయన దృష్టంతా కేవలం పనిపైనే ఉంటుందని, వేరే విషయాల గురించి పట్టించుకోరని తెలిసింది. దీనివల్ల అనవసరమైన ఫోన్​ కాల్స్​ను ఎత్తాల్సిన అవసరం ఉండదని అలా చేస్తారట.

ఇక అజిత్​ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్​లో దూసుకెళ్తోన్న ఆయన​ ఈ సంక్రాంతికి యాక్షన్ థ్రిల్లర్​ 'తునివు'తో ప్రేక్షకుల మందుకు రానున్నారు. తెలుగులో 'తెగింపు' పేరుతో ఈ మూవీ రిలీజ్ కానుంది. హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవలే విడుదలై ట్రైలర్​ కూడా బాగా ఆకట్టుకుంది. మంజు వారియర్ కథానాయిక. రానున్న సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి, వారిసు సినిమాల సరసన ఈ చిత్రం విడుదలవ్వనుంది.

ఇదీ చూడండి: ట్యూన్​ కోసం DSP కష్టం.. డిఫరెంట్​ ఇన్​స్ట్రుమెంట్స్​తో ప్రయోగం.. చివరకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.