ETV Bharat / entertainment

మిథాలీ, నా ఆలోచనలు ఒకేలా ఉంటాయి: తాప్సీ - తాప్సి

taapsee pannu mithali raj: క్రికెటర్ మిథాలీ రాజ్ ప్రయాణం నచ్చే 'శభాష్ మిథు' సినిమా చేశానని అన్నారు ప్రముఖ నటి తాప్సి. ఆమె ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ఈ చిత్రం ఆ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. మిథాలీ రాజ్​, తన ఆలోచనలు ఒకేలా ఉంటాయని తెలిపారు తాప్సి. యువ క్రీడాకారులకు అవకాశం ఇవ్వాలనే రిటైర్మెంట్ ప్రకటించానని మిథాలీ రాజ్ అన్నారు.

taapsee pannu mithali raj
తాప్సి మిథాలీ రాజ్
author img

By

Published : Jul 14, 2022, 6:51 AM IST

taapsee pannu mithali raj: "ట్రెండ్‌ని అనుసరించడం నాకు నచ్చదు. నేనొక క్లాసిక్‌గా నిలిచిపోవాలనుకుంటానే తప్ప.. మూసధోరణిలో ప్రయాణం చేయాలనుకోను. ఇప్పుడంతా బయోపిక్‌ల ట్రెండ్‌ కొనసాగుతుందని నేను ఆ సినిమాలు చేయడం లేదు. క్రికెటర్‌ మిథాలీరాజ్‌ ప్రయాణం నచ్చే ఈ సినిమా చేశా" అన్నారు ప్రముఖ నటి తాప్సి. ఆమె ప్రధాన పాత్ర ధారిగా తెరకెక్కిన చిత్రం 'శభాష్‌ మిథు'. అంతర్జాతీయ క్రికెట్‌లో 23 ఏళ్ల ప్రయాణం చేసిన ప్రముఖ క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వం వహించారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌ నిర్మించింది. ఈ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో తాప్సితోపాటు, మిథాలీ రాజ్‌ పాల్గొన్నారు.

తాప్సి మాట్లాడుతూ "ఈ చిత్రానికి ముందు క్రికెట్‌ ఎలా ఆడాలో, అసలు బ్యాట్‌ ఎలా పట్టాలో నాకు తెలియదు. ఆ ఆటలో మాస్టర్‌ అయిన మిథాలీరాజ్‌ పాత్రని పోషించాల్సి వచ్చినప్పుడు ఓ ఛాలెంజ్‌లా తీసుకున్నా. మిథాలీ అంటే అందరికీ తెలుసు. అలా మన పక్కనే కనిపిస్తున్న ఒకరి పాత్రని పోషించడం అంత ఆషామాషీ కాదు. సహజంగానే మామూలు సినిమాలతో పోలిస్తే బయోపిక్‌లలో నటించడం కొంచెం కష్టతరమైన పని. ప్రేక్షకుల్ని మెప్పించేలా నటించానని నమ్ముతున్నా" అన్నారు. మిథాలీ రాజ్‌ పాత్ర పోషిస్తున్నప్పుడు మీ ఇద్దరిలో ఏమైనా సారూప్యతలు కనిపించాయా? అని అడిగిన ప్రశ్నకి ఆమె బదులిస్తూ.. "బయట మేం చాలా భిన్నంగా కనిపిస్తాం కానీ, మా ఇద్దరికీ బలమైన ఓ విజన్‌ ఉంటుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయంలో మా ఇద్దరిలో ఓ స్పష్టత ఉంటుంది. ఆలోచనల పరంగా మేం దగ్గరగానే ఉన్నట్టు అనిపించింద"న్నారు తాప్సి.

  • మిథాలీరాజ్‌ మాట్లాడుతూ సొంత గడ్డపై ఆడే సిరీస్‌లు లేకపోవడంతోనే సామాజిక మాధ్యమాల ద్వారా రిటైర్మెంట్‌ని ప్రకటించాల్సి వచ్చిందన్నారు. లేకపోతే మైదానం నుంచే వీడ్కోలు తీసుకునే దాన్నని ఆమె చెప్పారు. "ప్రపంచకప్‌ ఆడాలనే లక్ష్యం ఉండేది. అది నెరవేరింది. ప్రపంచ కప్‌ తర్వాత జట్టు మారుతుంది. కొత్త జట్టుని నిర్మించాలంటే యువ క్రీడాకారులకి అవకాశాలు ఇవ్వాలి. ఇలాంటి సమయంలో మరికొన్ని సిరీస్‌లు ఆడాలని నాకు అనిపించలేదు. అందుకే రిటైర్మెంట్‌ ప్రకటించా" అన్నారు.

ఇవీ చదవండి:

మొదటి భార్య పేరు కలిసేలా.. దిల్​రాజు కొడుకు పేరు..!

కేఎల్​ రాహుల్​తో పెళ్లి.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.