ETV Bharat / entertainment

నటుడు బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు, ఏమైందంటే

నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన నటించిన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా విషయమై ఈ నోటీసులు ఇచ్చింది. అసలేమైందంటే

Etv BharatSUPREME COURT NOTICE TO NBK 100TH FILM
SUPREME COURT NOTICE TO NBK 100TH FILM
author img

By

Published : Aug 29, 2022, 8:04 PM IST

SUPREME COURT NOTICE TO BALAYYA: నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన హీరోగా నటించిన వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి పన్ను రాయితీ తీసుకొని టికెట్‌ రేటు తగ్గించలేదని సినీ వినియోగదారుల సంఘం పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ మేరకు హీరో బాలకృష్ణ, 'గౌతమిపుత్ర శాతకర్ణి' నిర్మాతలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు సహా ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.

గుణశేఖర్​ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'రుద్రమదేవి'కి కూడా నోటీసులు జారీ అయ్యాయి. రెండూ చారిత్రాత్మక చిత్రాలు కావడం వల్ల ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది. పన్ను రాయితీ ప్రయోజనాలను సినీ ప్రేక్షకులకు బదలాయించలేదని, రాయితీ పొందిన డబ్బు తిరిగి ప్రభుత్వం రికవరీ చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ధర్మాసనం వివరణ ఇవ్వాల్సిందిగా కథానాయకుడు బాలకృష్ణకు, నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది.

ఇదీ చదవండి:

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో, ఏమైంది

అన్న హరికృష్ణను గుర్తు చేసుకుంటూ బాలకృష్ణ ఎమోషనల్‌ పోస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.