ETV Bharat / entertainment

సూపర్​ స్టార్ కృష్ణ రికార్డ్​.. ఆ చిత్రాల్లో ఎక్కువగా నటించిన ఘనత ఆయనదే - super star krishna multistarrer movies record

టాలీవుడ్ సూపర్​ స్టార్ కృష్ణ ఎన్నో సూపర్​ హిట్ చిత్రాల్లో నటించారు. అందులో ఎక్కువగా మల్టీస్టారర్​, రీమేక్​ చిత్రాలు చేసి రికార్డు సృష్టించారు. ఓ సారి ఆయన నటించిన రీమేక్​ చిత్రాలు ఏంటో తెలుసుకుందాం..

Superstar krishna remake movie record
ఆ చిత్రాల్లో ఎక్కువగా నటించిన ఘనత సూపర్​స్టార్​ కృష్ణదే
author img

By

Published : Nov 15, 2022, 12:41 PM IST

టాలీవుడ్​లో ఎన్నో అద్భుతమైన, భిన్నమైన పాత్రలు పోషించి సూపర్​స్టార్​గా ఎదిగిన కృష్ణ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి అవార్డులను అందుకున్నారు. తెలుగు చిత్రసీమకు సాంకేతికంగా కొత్త దనాన్ని పరిచయం చేసి ప్రేక్షకుల్లో నూతనోత్సాహం తీసుకొచ్చారు. కెరీర్​ మొత్తంలో దాదాపు 350కు పైగా చిత్రాల్లో నటించారు. అందులో 80 వరకు మల్టీస్టారర్​ కాగా 54 వరకు రీమేక్ చిత్రాలు ఉండటం విశేషం. తెలుగులో రీమేక్‌, మల్టీస్టారర్​ చిత్రాల్లో ఎక్కువగా నటించిన ఘనత ఆయనదే.

  • ఆయన మొత్తం 54 రీమేక్‌ చిత్రాల్లో నటించారు. ఇందులో హిందీ రీమేక్‌ చిత్రాలు 17 ఉన్నాయి. బాలీవుడ్‌ నటుడు, నిర్మాత, దర్శకుడు రాజ్‌ కపూర్‌ నటించిన 'అనాడి' ఆధారంగా రూపుదిద్దుకున్న 'అమాయకుడు' చిత్రంలో హీరో కృష్ణ నటించారు. తన కన్నా సీనియర్‌ అయిన జమునతో ఆయన కలిసి నటించిన తొలి చిత్రం ఇదే. అడ్డాల నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాటలన్నీ హిట్టే. 1968 మే 10న విడుదలైన అమాయకుడు చిత్రం హైదరాబాద్​లోని సాగర్‌ థియేటర్‌లో 48 రోజులు ఆడింది.
  • హిందీలో విజయం సాధించిన 'వక్‌ త్‌' ఆధారంగా రూపుదిద్దుకున్న 'భలే అబ్బాయిలు' చిత్రంలో కృష్ణ, కృష్ణంరాజు, రామ్మోహన్‌ హీరోలుగా నటించారు. నటుడు పెకేటి శివరాం దర్శకత్వంలో రూపొందిన రెండో తెలుగు చిత్రం ఇది. కే ఆర్‌ విజయ హీరోయిన్​గా నటించిన ఈ చిత్రం 1969 మార్చి 1న విడుదలై పాజిటివ్ టాక్​ను తెచ్చుకుంది.
  • అశోక్‌ కుమార్‌, నళినీ జయంత్‌ కాంబినేషన్‌లో హిందీలో రూపు దిద్దుకున్న 'మిస్టర్‌ ఎక్స్‌' చిత్రానికి రీమేక్‌ 'శభాష్‌ సత్యం. తెలుగు, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో కృష్ణ సరసన రాజశ్రీ నటించారు. క్రైమ్​ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
  • తమిళనాడులోని తొలి నాటి స్టూడియోలో మోడరన్‌ థియేటర్స్‌ ఒకటి. తమిళ, మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో వందకు పైగా చిత్రాలు నిర్మించిన సంస్థ ఇది. మోడరన్‌ థియేటర్స్‌ నిర్మించిన 110 వ చిత్రం 'నేనూ మనిషినే'లో హీరో కృష్ణ నటించారు. హిందీలో జితేంద్ర నటించిన 'దోబాయ్‌' చిత్రానికి రీమేక్‌ ఇది. కాంచన కథానాయికగా నటించిన ఈ చిత్రం 1971 అక్టోబర్‌ 16 న విడుదలైంది ఆకట్టుకుంది.
  • మరాఠీలో రూపొంది ఆరు అవార్డులు అందుకున్న 'అపరాధ్‌' చిత్రం ఆధారంగా రూపొందిన 'గూడు పూటానీ' చిత్రంలోనూ హీరోగా నటించారు కృష్ణ. శుభ హీరోయిన్​. ఆర్వో కలర్‌లో తీసిన తొలి సినిమా ఇదే. పాపులర్‌ సాంగ్‌ 'తనివి తీరలేదే' ఈ సినిమాలోనిదే.
  • విజయ సంస్థలో హీరో కృష్ణ నటించిన తొలి చిత్రం 'గంగ మంగ'. హిందీలో హిట్‌ అయిన 'సీత ఆవుర్‌ గీత' ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేశారు. శోభన్‌ బాబు మరో హీరోగా నటించారు. 1973 నవంబర్‌ 30 న విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు.
  • శశి కపూర్‌, ముంతాజ్‌ జంటగా రూపొందిన 'చోర్​ మచాయె షోర్‌' చిత్రాన్ని 'భలే దొంగలు' పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. కృష్ణ, మంజుల జంటగా నటించిన ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషించిన మోహన్‌ బాబుకు మంచి గుర్తింపు లభించింది. 1976 అక్టోబర్‌ 29న విడుదలైన ఈ సినిమా హిట్​గా నిలిచింది
  • హీరో కృష్ణ బావమరిది సూర్యనారాయణ బాబు నిర్మించిన మరో చిత్రం 'మనుషులు చేసిన దొంగలు'. ఇందులో కృష్ణంరాజు, కృష్ణ అన్నదమ్ములుగా నటించారు. మంజుల కథానాయిక. హిందీలో హిట్‌ అయిన 'హాత్‌ కి సఫాయి' చిత్రానికి రీమేక్‌ ఇది. ఈ చిత్రం 1977 అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
  • హిందీలో విజయవంతమైన 'ఏక్‌ సే బడకర్‌ ఎక్‌' చిత్రం ఆధారంగా రూపొందిన చిత్రం 'ముగ్గురూ ముగ్గురే'. కృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో జయచిత్ర కథానాయిక. సత్యనారాయణ, మోహన్‌ బాబు కీలక పాత్రలు పోషించారు. 1978 మే 27న రిలీజ్​ అయిన ఈ సినిమా కూడా బాగానే ఆడింది.
  • వినోద్‌ ఖన్నా, విద్యా సిన్హా జంటగా నటించిన 'ఇన్‌ కార్‌'కు రీమేక్‌గా రూపొందిన 'దొంగల వేట' చిత్రంలో కృష్ణ, జయప్రద జంటగా నటించారు. 1978 జూలై 14న విడుదలైన ఈ చిత్రం విజయం సాధించింది.
  • ఇలా ఇంకెన్నో హిట్​ రీమేక్​ సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు కృష్ణ.

ఇదీ చూడండి: Krishna: అభిమాన హీరోలతో నటించి.. మల్టీస్టారర్ల చిత్రాలతో రికార్డు సృష్టించి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.