విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న 'ఇండియన్ 2' సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. దర్శకుడు శంకర్ 'ఇండియన్ 2', 'ఆర్‌సీ 15' రెండు సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. వీటిలో ఏదో ఒక సినిమా వచ్చే సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందట. ప్రస్తుతం కమల్ 'ఇండియన్ 2' షూటింగ్ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో తెలుగు స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నట్లు తెగ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై వెన్నెల కిశోర్ క్లారిటీ ఇచ్చారు.
ఒక నెటిజన్.. కమెడియన్ వెన్నెల కిశోర్‌తో 'భయ్యా మీరు 'ఇండియన్ 2'లో ఉన్నారా?' అని ట్విట్టర్‌లో అడిగాడు. వెన్నెల కిషోర్ ఈ ఊహాగానాలను కొట్టిపారేస్తూ తనదైన స్టైల్‌లో కామెడీగా రిప్లై ఇచ్చారు. 'ఇండియన్ 2 లో లేను పాకిస్థాన్ 3 లో లేను' అని తెలిపారు. ఇక సినిమాలో ఆరు నుంచి ఏడగురు విలన్లు ఉంటరని మరో వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు.
స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే శంకర్- కమల్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన భారతీయుడు సినిమా కూడా భారీ విజయం సాధించింది. ఆ చిత్రానికి ఇండియన్-2 రీమేక్ కావడంతో ఫ్యాన్స్‌లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్, పోస్టర్స్‌కు భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది.
-
@vennelakishore enti kaka idhi nijama https://t.co/W8BJLz9IS5
— irah_the cult rebel (@irah_cult_rebel) February 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">@vennelakishore enti kaka idhi nijama https://t.co/W8BJLz9IS5
— irah_the cult rebel (@irah_cult_rebel) February 28, 2023@vennelakishore enti kaka idhi nijama https://t.co/W8BJLz9IS5
— irah_the cult rebel (@irah_cult_rebel) February 28, 2023
పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఇండియన్ 2లో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. ఈ చిత్రానికి కూడా సంగీతం అందించనున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.