ETV Bharat / entertainment

RAPO 20: రామ్​తో శ్రీలీల రొమాన్స్​.. బోయపాటి మాస్​ యాక్షన్​ షురూ.. - రామ్​ పోతినేని శ్రీలీల

రామ్​ పోతినేని, బోయపాటి శ్రీను కలయికలో కొత్త సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాలో రామ్​కు జోడీగా యువ నటి శ్రీలీలను తీసుకుంటున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మరోవైపు, అల్లరి నరేశ్​ నటిస్తున్న 'ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం'చిత్రంలోని మొదటి పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ram pothineni new movie heroine
ram pothineni new movie heroine
author img

By

Published : Oct 5, 2022, 1:48 PM IST

టాలీవుడ్​ యువ హీరో రామ్​ పోతినేని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం ఇటీవలే జరిగింది. శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే రామ్​కు జోడీగా ఎవరు కనబడబోతున్నారన్న విషయంపై చాలా వార్తలు వచ్చాయి. వీటన్నింటికీ తెరతీస్తూ చిత్ర యూనిట్ హీరోయిన్​ను ప్రకటించింది.

దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో.. ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్​ తనుయుడు నటించిన 'పెళ్లి సందడి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీలీల. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సుందరినే ఇప్పుడు రామ్​ 20వ చిత్రంలో హీరోయిన్​గా ఎంపిక చేశారు. ఈ మేరకు శ్రీనివాస సిల్వర్​ స్క్రీన్​ సంస్థ ట్వీట్ చేసింది. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు కాలేదు. కానీ 'బోయపాటి ర్యాపో' అనే వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ స్వరాలు సమకూర్చుతున్నారు. అయితే ఈ​ సినిమాలో ఉన్న నటీనటుల వివరాలు వెల్లడించలేదు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్నట్టు సమాచారం.

ram pothineni new movie heroine
.

అల్లరి నరేశ్​.. 'లచ్చిమీ లచ్చిమీ' పాట..
తెలుగు ప్రముఖ నటుడు అల్లరి నరేశ్​ నటిస్తున్న చిత్రం 'ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం'. ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్​. 'లచ్చిమీ లచ్చిమీ' అంటూ సాగే ఈ పాట అద్భుతంగా ఉంది. జావేద్ అలీ గాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

వరుస ఫ్లాపుల తర్వాత నరేశ్​ కాస్త రూటు మార్చారు. ఇంతకముందు విడుదలైన 'నాంది'తో మంచి విజయం అందుకున్నారు. దీంతో అలాంటి వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటున్నారు. నరేశ్​ 59వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా సస్పెన్స్​ థ్రిల్లర్​గా తెరకెక్కుతోంది. ఇప్పటికే టీజర్​ విడుదలైంది. ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిశోర్ కూడా ప్రముఖ ప్రాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ మోహన్​ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేశ్ దండ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల స్వరాలందిస్తున్నారు.

ఇవీ చదవండి: ఘనంగా గుడ్డూ భయ్యా వివాహ వేడుక​.. రిసెప్షన్​లో తాప్సీ, టబు, ఈషా సందడే సందడి!

'ఆదిపురుష్​ తీసింది వారి కోసం కాదు!'.. ట్రోల్స్​పై దర్శకుడి కౌంటర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.