ETV Bharat / entertainment

అక్టోబర్​లో 'ఆదిపురుష్'​ భారీ అప్డేట్​.. ట్రైలర్ రిలీజ్ అప్పుడే! - ఆదిపురుష్​లో రాముడిలా ప్రభాస్​

Adipurush Teaser : దసరా అంటే సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది. అదే మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా పండుగలో భాగం అయిపోయింది. ఈసారి కూడా దసరాకు విడుదలయ్యేందుకు సినిమాలు క్యూ కడుతున్నాయి. రిలీజ్ సాధ్యంకాని సినిమాలు అప్డేట్లు ఇస్తున్నాయి. అందులో భాగంగానే ప్రభాస్​ 'అదిపురుష్​' టీమ్​ దసరా కానుకగా కొన్ని అప్డేట్లు ప్లాన్​ చేసింది. అవేంటంటే..

adipurush teaser release date
adipurush teaser release date
author img

By

Published : Sep 27, 2022, 11:02 AM IST

Adipurush Teaser : ప్రపంచలోకెల్లా భారత్​లోనే అత్యధిక సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అందులో తెలుగు సినీ పరిశ్రమ నుంచే ఎక్కువ సినిమాలు ఉంటున్నాయి. అంతలా తెలుగు చిత్ర పరిశ్రమ పాతుకుపోయింది. అయితే ఇన్ని చిత్రాల్లో అగ్ర కథానాయకుల సినిమాలు అప్పుడప్పుడు దర్శనమిస్తున్నాయి. చిన్న సినిమాలతో కాలక్షేపం చేస్తూ.. ప్రేక్షకులు తమ అభిమాన తారల కోసం ఒక్కోసారి ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.

సినిమాల నిర్మాణ వ్యయం పెరగడం, షూటింగ్​ల కోసం భారీ సెట్లను నిర్మించడం, గ్రాఫిక్స్​ లాంటి కారణాలతో బడా హీరోల సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. సంవత్సరం మొత్తం ఎడతెరిపి లేకుండా చిన్న సినిమాలు ఉంటాయి. ఇంతకముందు పండుగలకు పెద్ద చిత్రాలు రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఏ దసరాకో, సంక్రాంతికో ఓ పెద్ద సినిమా వచ్చేది గగనం. అయితే చిన్న చిత్రాలు మాత్రం పండుగ సమయాల్లో విడుదల అవుతున్నాయి.

అయితే కొన్నాళ్ల నుంచి చిత్ర పరిశ్రమ ట్రెండ్​ మార్చింది. సినిమా షూటింగ్​కు సంవత్సరాల సమయం పట్టడం కారణంగా స్టార్ల పుట్టిన రోజుకో, ఏదైనా పండుగకో అప్డేట్​ ఇస్తున్నాయి నిర్మాణ సంస్థలు. దీనికి కారణం కూడా ఉందండోయ్​. అందేంటంటే.. రెండు మూడు సంవత్సరాలకు పూర్తయ్యే సినిమా గురించి అందురు మరిచిపోతారని ఇలా చేస్తున్నారు. అటు ప్రేక్షకులు మరిచిపోకుండా, ఇటు ప్రచారం కూడాఅయిపోతుంది అలాంటి చిత్రాలకు.

adipurush teaser release date
ఆదిపురుష్​

దసరా సందర్భంగా అనేక చిన్న సినిమాలు రిలీజ్​ అవుతున్నాయి. అగ్ర కథానాయకులూ సందడి చేయబోతున్నారు. ఇక నిర్మాణంలో ఉన్న సినిమాలు సైతం పండుగకు కానుకలు సిద్ధం చేస్తున్నాయి. ప్రభాస్ కొత్త సినిమా 'ఆదిపురుష్​' నుంచి డబుల్ ధమాకా అప్డేట్​​ రాబోతుంది.

adipurush teaser release date
ఆదిపురష్​

టీజర్ రిలీజ్ అప్పుడే..

adipurush teaser release date
ఆదిపురుష్​ మూవీ టీమ్​
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్​ స్టార్​ నటిస్తున్న పాన్​ ఇండియా సినిమా 'ఆదిపురుష్'. ఈ సినిమా నుంచి అక్టోబర్​లో ముఖ్యమైన అప్డేట్స్​ వస్తున్నాయి. అక్టోబర్​ 2న అయోధ్యలో ప్రభాస్​ టీజర్ గ్లింప్స్​ విడుదల చేయనున్నారని సమాచారం. దసరా సందర్భంగా అక్టోబర్ 5న రాం లీలాలో ప్రభాస్ రావణ దహనం చేయనున్నారని సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23న టీజర్ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఆ తర్వాత నవంబర్ చివరలో ట్రైలర్ విడుదల చేయొచ్చని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. జనవరి 2023లో 'ఆదిపురుష్​'ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.
adipurush teaser release date
రావణుడిలా సైఫ్​ అలీ ఖాన్

'బాహుబలి' అద్భుత విజయం సాధించిన తర్వాత.. ప్రభాస్ ఈ భారీ ప్రాజెక్ట్​లో నటిస్తున్నారు. ఓం రౌత్​ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను.. టీ సిరీస్ ఫిలింస్, ఓం రౌత్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి సనన్​ సీతగా కనిపించబోతున్నారు. సైఫ్​ అలీ ఖాన్ లంకాధిపతి రావణుడి పాత్రలో నటిస్తున్నారు. ఇక సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్ర చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి హేమ మాలిని కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

నిజానికి ఇవే బాగున్నాయ్​..

adipurush teaser release date
ఆదిపురుష్​ ఫ్యాన్​ మేడ్​ పోస్టర్​
ఒక విధంగా చెప్పాలంటే బాలీవుడ్ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా భారీ అంచనాలే ఉన్నాయి. అప్పుడప్పుడు అప్డేట్లు వదులుతూ చిత్ర యూనిట్.. ప్రేక్షకుల నోళ్లల్లో సినిమా నానేలా చేస్తోంది. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఫ్యాన్ మేడ్​ పోస్టర్లు క్రియేట్​ చేస్తున్నారు. ఇవి అధికారిక పోస్టర్లకు ఏమాత్రం తీసిపోవడం లేదు. సినిమా గురించి గాసిప్​లతో ఇన్​బాక్స్​లు నిండిపోతున్నాయి. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
adipurush teaser release date
ఆదిపురుష్​ ఫ్యాన్​ మేడ్​ పోస్టర్​
adipurush teaser release date
ఆదిపురుష్​ ఫ్యాన్​ మేడ్​ పోస్టర్​

ఇవీ చదవండి : అక్టోబర్​లో క్రేజీ కాంబినేషన్స్​.. పండుగ టైంలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌

'సెలబ్రిటీలకూ హక్కులుంటాయ్'.. తొక్కిసలాట కేసులో షారుక్​కు ఊరట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.