ETV Bharat / entertainment

రచయితగా మారిన సోనూ సూద్​.. సినిమా రిలీజ్​ అప్పుడే - సోను సూచ్​ రచయితగా

సినిమాల్లో విలన్​గా నటించి.. నిజజీవితంలో హీరోగా ఎంతో మంది ప్రజలను ఆదుకున్నారు సోనూ సూద్. ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు​​. అయితే త్వరలో రాబోతున్న 'ఫతే' మూవీకి రచయితగా మారనున్నారట. ఆ కథేంటో చూద్దాం..

sonu sood fathe movie writer
sonu sood fathe movie writer
author img

By

Published : Oct 22, 2022, 5:34 PM IST

సోనూ సూద్​..పెద్దగా పరిచయం లేని వ్యక్తి. సినిమాల్లో విలన్​గా ఎన్నో పాత్రల్లో తనదైన గుర్తింపు తెచ్చుకొన్నారు. నిజజీవితంలో మాత్రం రియల్​ హీరోగా ఎంతో మంది ప్రజలను ఆదుకున్నారు. అయితే త్వరలోనే ఆయన మరో కొత్త అవతారం ఎత్తనున్నారు. 'ఫతే' మూవీతో రచయితగా మారనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. యాక్షన్​ థ్రిల్లర్​గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి..'బాజీరావు మస్తానీ', 'శంసేరా' చిత్రాలకు అసిస్టెంట్​ డైరెక్టర్​గా పని చేసిన అభినందన్​ గుప్తా సహాయం చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా డిజిటల్​​ మోసాల నేపథ్యంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. గత ఏడాదిన్నర నుంచి ఈ స్క్రిప్ట్​పై పని చేస్తున్నట్లు ​ వివరించారు.

'ఫతే' సినిమా కోసం ఎథికల్​ హ్యాకర్లతో సంప్రదింపులు జరిపానని, ఈ సినిమా చాలా ప్రత్యేకమైనదని ఆయన చెప్పారు. సోనూసూద్​ బ్యానర్​ శక్తి సాగర్​ ప్రొడక్షన్​లో.. ఈ చిత్రం తెరకెక్కనుందని చెప్పారు. 2023 జులై-ఆగస్టు నాటికి విడుదల చేస్తామని నటుడు సోనూ సూద్​ తెలిపారు. ఫతే తరవాత ఇ నివాస్​ దర్శకత్వంలో మరో కొత్త సినిమా 'కిసాన్' ప్రారంభిస్తామని సోనూ సూద్​ అన్నారు.​ ​

ఇవీ చదవండి : రూ.200కోట్ల కేసు.. జాక్వెలిన్​కు మధ్యంతర బెయిల్ పొడిగింపు

దర్శకురాలిపై చీటింగ్ కేసు.. యువ నటుడిని అశ్లీల చిత్రంలో నటించమని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.