ETV Bharat / entertainment

తొలి సినిమాతోనే ఆస్కార్​ నామినేషన్లలో చోటు.. ఎవరీ 'కార్తికి'? - the elephant whisperes movie

రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు, వాటిని ఆదరించిన దంపతుల కథ.. 42 నిమిషాల సినిమా! దానికోసం ఆవిడ పడిన కష్టం అయిదేళ్లు. కనిపించేది ఇద్దరు వ్యక్తులు, రెండు ఏనుగు పిల్లలే.. కానీ చిత్రీకరించింది మాత్రం 450 గంటల ఫుటేజీ! అంతేనా.. ప్రపంచ దృష్టినీ, దాంతోపాటు ఆస్కార్‌ నామినేషన్లలో చోటునీ సంపాదించగలిగారు కార్తికి గోన్‌సాల్వెస్‌. అదీ మొదటి సినిమాతోనే! ఇంతకీ ఎవరీమె?

oscar nominated short movie the elephant whisperes
ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ నిర్మాత కార్తికి గోన్‌సాల్వెస్‌
author img

By

Published : Jan 26, 2023, 8:46 AM IST

'మహిళలు, గిరిజన తెగలు, ప్రకృతి, మూగజీవాల గొంతుక అవ్వాలనుకున్నా. అందుకు నేను ఎంచుకున్న మార్గం ఫొటోగ్రఫీ! ప్రజల్లో మార్పు తేవడానికి నాకు కనిపించిన అత్యంత ప్రభావవంతమైన ఆయుధమిది' అంటారు కార్తికి. ఈవిడ దృష్టి రెండు అంశాలపైనే! పర్యావరణం, వన్యప్రాణులు, ప్రకృతి చిత్రాల ద్వారా జీవావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం. అడవుల్లో జీవనం, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడం. అందరూ సంపాదనలో పడితే.. తను ప్రకృతి చుట్టూ తిరగడానికి కుటుంబమే కారణమంటారు కార్తికి.

'నాన్న ఫొటోగ్రాఫర్‌, అమ్మకేమో మూగజీవులంటే ఇష్టం. బామ్మ పర్యావరణ ప్రేమికురాలు. మమ్మల్నే కాదు.. చుట్టు పక్కల పిల్లల్నీ అడవులు, జంతు ప్రదర్శన శాలలు, పర్వతాల చుట్టూ తిప్పేది. ముగ్గురి అభిరుచులన్నీ నాకబ్బాయి' అని నవ్వేస్తారామె. కార్తికిది ఊటీ. దగ్గర్లోని నీలగిరి జీవావరణ రిజర్వ్‌లోనే పెరగడంతో వన్యజీవులపై అవగాహన, ప్రేమ ఏర్పడ్డాయి. 'మొదట ఫొటోగ్రాఫర్‌ అవ్వడమే లక్ష్యం. అందుకే విజువల్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ, ఫొటోగ్రఫీ అండ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌లో పీజీ చేశా. తర్వాత మనసు మాట విని ప్రకృతి, దాని చుట్టూ జీవనంపై దృష్టిపెట్టా' అంటారు.

oscar nominated short movie the elephant whisperes
ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌

సినిమా ఆలోచనెలా?
అయిదేళ్ల క్రితం.. ఇంటికి వెళుతున్నప్పుడు ఓ వ్యక్తి ఏనుగు పిల్లతో వెళ్లడం గమనించారామె. వాళ్లిద్దరి అనుబంధం కార్తికిని ఆశ్చర్యపరిచింది. అతనితో మాట కలిపితే తప్పిపోయిన ఏనుగు పిల్లను ఆయన చేరదీసిన విధానం చెప్పారు. ఆ సంఘటన కార్తికి కెరియర్‌ను మలుపు తిప్పింది. 'ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌' తీసేలా ప్రేరేపించింది. 'నా సినిమాలోని బొమన్‌, బెల్లీ ఇద్దరూ ఆ ఏనుగు పిల్లలను నిజంగా పెంచుతున్నవాళ్లే. వాళ్ల అనుబంధమే కథగా తీశా. దాన్ని హడావుడి కథగా ముగించడం ఇష్టం లేదు. భావోద్వేగాలను చూపించాలి. కెమెరా లేదన్న భావన కలిగించినప్పుడే అది సాధ్యం. దానికోసం నేను ముందు 18 నెలలు వాళ్లతో అనుబంధం పెంచుకున్నా. మిగతా సమయమంతా ఏనుగులు, వాళ్ల మధ్య సహజ సాన్నిహిత్యాన్ని చిత్రీకరించాం. అందుకే 450 గంటల ఫుటేజీ వచ్చింది. ఈ సమయంలోనే బొమన్‌, బెల్లీ పెళ్లి చేసుకున్నారు. అలా కట్టునాయకన్‌ తెగ సంస్కృతినీ తెలియజేసే అవకాశం వచ్చింది. మొత్తం అటవీ ప్రాంతం కదా.. కొన్ని అపాయాలూ తప్పలేదు. అయినా అవన్నీ అందమైన అనుభవాలే' అనే 36 ఏళ్ల కార్తికి మొదటి సినిమాకే ఆస్కార్‌ నామినేషన్‌ పొందారు. తన కథ మానవ జీవనంలో ప్రకృతి ఆవశ్యకతపై కొందరిలోనైనా అవగాహన కలిగిస్తే చాలంటారు. అన్నట్టూ ఈ సినిమాకు నిర్మాతా ఓ మహిళే. పనిచేసింది ముగ్గురే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.