ETV Bharat / entertainment

అలాంటి పాత్రలు చెయ్యొద్దని డాక్టర్లు సలహా ఇచ్చారు: హీరో శర్వానంద్​ - హీరో శర్వానంద్​ ఒకే ఒక జీవితం సినిమా

తల్లి-కొడుకు సెంటిమెంట్‌తో ఇటీవలే విడుదలైన చిత్రం 'ఒకే ఒక జీవితం' . శర్వానంద్, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అమల కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న శర్వానంద్.. పలు విషయాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..

sharwanand interview
sharwanand interview
author img

By

Published : Sep 18, 2022, 9:49 AM IST

Hero Sharwanand OKe Oka Jeevitham Movie : సున్నితమైన... సాహసోపేతమైన ఇలాంటి కథలతో విజయాన్ని అందుకోవడం ప్రత్యేకం అన్నారు శర్వానంద్‌. మంచి కథల్ని ఎంపిక చేసుకుంటాడనే గుర్తింపున్న కథానాయకుల్లో ఆయన ఒకరు. ఇటీవల విడుదలైన 'ఒకే ఒక జీవితం'తో కథానాయకుడిగా మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను ముచ్చటించారు.

"నా మనసుకు బాగా దగ్గరైన సినిమా 'ఒకే ఒక జీవితం'. ఇలాంటి కథల్లో లాజిక్‌ వెడకడం చాలా సులువు. అలాంటి ఈ సినిమా అటు ప్రేక్షకులతోపాటు, ఇటు విమర్శకులని కూడా మెప్పించింది. మేం ఊహించినట్టుగానే సినిమా అందరికీ కనెక్ట్‌ కావడంతోనే ఈ విజయం దక్కింది. పిల్లలు కూడా ఈ సినిమాని ఆస్వాదిస్తున్నారు. ఈమధ్య చిన్నారుల కోసం ఓ షో వేశాం.వాళ్లు చాలా ఆస్వాదించారు. టైమ్‌ మిషన్‌ ఎక్కి ఎక్కడికి వెళతారని అడిగితే... 'మేం ఇక్కడే ఉంటాం. ఈ లైఫ్‌ బాగుంది' అన్నారు. ఈతరం పిల్లల్ని వాళ్ల అభిరుచులకి తగ్గట్టుగా పెంచుతున్నారు తల్లిదండ్రులు. అందుకే వాళ్లు జీవితాన్ని ఆస్వాదిస్తున్నారని అర్థమైంది" అంటూ శర్వానంద్​ చెప్పుకొచ్చారు.

"నా వరకైతే నా జీవితంలో ఇంటర్‌ రోజులంటే చాలా ఇష్టం. హ్యాపీడేస్‌ అవి. రేపటి గురించి ఆలోచన అనేదే ఉండేది కాదు. టైమ్‌ మిషన్‌లో ప్రయాణం చేస్తే మరోసారి ఆ రోజులకి వెళతా. దర్శకుడు శ్రీకార్తీక్‌ 'ఒకే ఒక జీవితం' కథని చాలా బాగా చెప్పాడు. అప్పుడే తన ప్రతిభ ఏమిటో అర్థమైంది. ఈ సినిమా చేయకపోతే నువ్వు చాలా కోల్పోతావని వేరే నటులకి నేనెప్పుడూ చెప్పలేదు. వెన్నెల కిషోర్‌కి మాత్రం నువ్వు అస్సలు మిస్‌ చేసుకోవద్దని ఈ సినిమా కోసం ఒప్పించా. సినిమాపై నాకున్న నమ్మకం నిజమైంది."

-- హీరో శర్వానంద్​

"సినిమాకి ఎంత అర్హత ఉందో, అంత వసూలు చేస్తుంది. అంతే తప్ప, నా సినిమా ఇంత వసూలు చేయాల్సిందే అని నేనెప్పుడూ లెక్కలేసుకోను. ఇంతే వచ్చిందేమిటని ప్రేక్షకుల్ని కానీ, మరొకరిని కానీ తప్పు పట్టను. ఈ తరహా కథ ఇంత వసూలు చేయడం, వారాలు గడుస్తున్నా విజయవంతంగా ప్రదర్శితమవుతుండడం గొప్ప విషయం కదా. నా దృష్టిలో చేసే ఏ కథ, పాత్ర కూడా నటులకి సౌకర్యంగా అనిపించదు. మనం కానిదే కెమెరా ముందుకెళ్లి చేసి చూపిస్తాం. గాఢతతో కూడుకున్న పాత్రలు చేస్తున్నప్పుడు ఎంత కాదన్నా ఒత్తిడి ఉంటుంది. వాటి నుంచి బయటికి రావడం కూడా ఇంకా అలవాటు కాలేదు. అందుకే మా వైద్యులు కూడా ఇలాంటి పాత్రలు చేయొద్దని సలహా ఇచ్చారు (నవ్వుతూ). కామెడీ పాత్రల్ని మాత్రం బాగా ఆస్వాదిస్తా. బయటికి వచ్చాక కూడా సంతోషంగా గడపొచ్చు కదా. అయితే నేనెప్పుడూ ఈ తరహా సినిమా చేయాలని ముందు ప్రణాళిక వేసుకోలేదు. నా దగ్గరికి వచ్చిన కథలే చేశాను. తదుపరి రాజకీయ ప్రధానంగా సాగే కథ చేస్తున్నా. కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో నా పాత్ర ఇదివరకెప్పుడూ చేయనిది. స్వార్థపరుడి పాత్ర అది. దీంతోపాటు మరో మూడు కథలు విని ఓకే చేశా. ఈ మధ్య 14 కిలోల బరువు తగ్గాను. నాకోసం నేను తగ్గాను తప్ప, ప్రత్యేకంగా ఓ సినిమాకోసమేం కాదు" అంటూ శర్వానంద్​ చెప్పుకొచ్చారు.

ఇవీ చదవండి: 'హీరో అంటే అబ్బాయేనా? ఒక అమ్మాయి ఉండటం సాధ్యం కాదా?'

ఒక్క తెలుగు సినిమాతో స్టార్​ హీరోయిన్​గా​.. ఈ చిన్నారిని గుర్తుపట్టగలరా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.