ETV Bharat / entertainment

సైలెంట్​గా బీచ్​ మధ్యలో షారుక్​-నయన్​ డ్యూయెట్​.. కెమెరాకు దొరికేశారుగా! - Jawaan song sea ship video leaked

షారుక్​ ఖాన్​-నయనతారకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో వీరిద్దరు కలిసి డ్యూయెట్​ వేసుకుంటున్నారు. ఆ వీడియో చూశారా?

Sharukh khan Nayantara Jawaan movie shooting video leaked
సైలెంట్​గా బీచ్​ మధ్యలో షారుక్​-నయన్​ డ్యూయెట్​.. కెమెరాకు దొరికేశారుగా!
author img

By

Published : Apr 13, 2023, 10:22 AM IST

బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్ హీరోగా కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా 'జవాన్'. నయనతార హీరోయిన్​గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వరుస ఫ్లాప్​లో ఉన్న షారుక్​ ఖాన్ ఇటీవలే 'పఠాన్' సినిమాతో బాక్సాఫీస్​ ముందు గర్జించారు. ఏకంగా రూ.1000కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నారు. దీంతో షారుక్​ నుంచి రాబోతున్న 'జవాన్' మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరిన్ని రికార్డులు బద్దలు కొడతారని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్​కు సంబంధించిన అప్డేట్​ వీడియో ఒకటి సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇందులో షారుక్​-నయనతార డ్యూయెట్ వేసుకుంటున్నారు. సముద్రం మధ్యలో ఓ భారీ షిప్​పై ఈ సాంగ్​కు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాట బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్​ ఫరాఖాన్‌ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్నారు. దీనిని యంగ్ అండ్​ పాపులర్​ సింగర్ అర్జిత్ సింగ్ ఆలపించారు. ఈ పాట సినిమాకు హైలెట్‌గా నిలిచేపోయేలా అట్లీ ప్లాన్ చేశాని సమాచారం అందింది. అందుకే దీనిని గ్రాండ్​గా తెరకెక్కిస్తున్నారట.

ఇకపోతే ఈ సినిమాలో షారుక్​.. డ్యుయెల్ రోల్​ చేయబోతున్నారని తెలుస్తోంది. తండ్రి, కొడుకులుగా ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారట. అలాగే న‌య‌న‌తార ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్‌గా కనిపించబోతునట్లు టాక్ వినిపిస్తోంది. పెళ్లైనా కూడా ఆమె ఈ చిత్రంలో బికినీలో కనిపించనుందట. ఈ వార్త తెలిసి ఆమె అభిమానులు ఖుషి అవుతున్నారు. కోలీవుడ్ స్టార్ యాక్టర్​ విజయ్‌ సేతుపతి, సన్యా మల్హోత్రా, ప్రియమణి, సునీల్ గ్రోవర్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ బికినీ హీరోయిన్​ దీపికా పదుకొణె గెస్ట్ రోల్​లో మెరవనుందట. తమిళ మ్యూజిక్ సెన్షేషన్​ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. రెడ్ చిల్లీస్ బ్యాన‌ర్‌పై షారుక్​ ఖాన్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాతో పాటు షారుక్‌ ఖాన్‌.. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న 'టైగర్‌ 3'లో అతిథి పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు దిగ్గజ దర్శకుడు రాజ్‌ కుమార్ హిరానీ దర్శకత్వంలో 'డంకీ' చిత్రంలో కూడా కనిపించనున్నారు. రీసెంట్​గా ఫస్ట్​ లుక్​ కూడా విడుదలైంది. ఇది చూస్తుంటే ఆయన ఆర్మీ అధికారిగా నటించనున్నారని తెలుస్తోంది. తాప్సీ పన్ను హీరోయిన్​గా నటిస్తోంది. బొమన్ ఇరానీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక నయనతార 'జవాన్' చిత్రంతో పాటు మరో మూడు తమిళ చిత్రాల్లోనూ నటిస్తోంది. అవి ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి.

ఇదీ చూడండి: నైట్​ పార్టీలో ఎన్టీఆర్​.. జక్కన్న, కొరటాల, త్రివిక్రమ్​తో కలిసి చిల్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.