ETV Bharat / entertainment

షారుక్ 'పఠాన్' వెయ్యి కోట్లు.. ఇంకా జోరు తగ్గలే! - షారుక్ పఠాన్ వెయ్యి కోట్లు

షారుక్​ 'పఠాన్'​ విడుదలై నెల రోజులు కావొస్తున్నా బాక్సాఫీస్​ను ఇంకా షేక్ చేస్తూనే ఉంది. తాజాగా మరో అరుదైన ఫీట్​ను అందుకుంది. ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్​లోకి అడుగుపెట్టింది.

sharukh pathaan 1000 crores
షారుక్​ వెయ్యి కోట్లు
author img

By

Published : Feb 21, 2023, 5:03 PM IST

బాలీవుడ్ కింగ్​ షారుక్​ ఖాన్​ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్​ మూవీ 'పఠాన్' విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్​ను షేక్ చేస్తూనే ఉంది. అదిరిపోయే రికార్డులను తిరగరాస్తోంది. విడుదలకు ముందు ఎన్నో విమర్శలు అందుకున్నప్పటికీ.. రిలీజ్ తర్వాత తొలి రోజు నుంచే అద్భుతమైన టాక్​తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలై నెల రోజులు అవుతున్నా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. తొలి వారం రోజుల్లో అయితే ఏకంగా రోజుకో వంద కోట్లను ఖాతాలో వేసుకుంది. అంటే ఈ సినిమా ఏ రేంజ్​లో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఐదేళ్ల విరామం తర్వాత వచ్చిన షారుక్​.. ఆకలితో వేటాడే సింహాంలా గర్జించారు.

అయితే ఈ సినిమా తాజాగా మరో రికార్డును దక్కించుకుంది. ఏకంగా రూ.1000 కోట్ల క్లబ్​లోకి చేరింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్​ వసూళ్లను అందుకుంది. భారత్​లో రూ.623కోట్లు గ్రాస్​.. ఓవర్సీస్​లో రూ.377కోట్ల గ్రాస్​ కలెక్ట్ చేసింది. ఇకపోతే వరల్డ్ వైడ్​గా ​అమీర్ ఖాన్ 'దంగల్' రూ. 2,100 కోట్లు, ప్రభాస్ 'బాహుబలి 2' రూ. 1810 కోట్లు, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'కేజీఎఫ్', రాజమౌళి 'ఆర్​ఆర్​ఆర్'​ రూ.1250కోట్లు(అంచనా) వసూలు చేశాయి.

కాగా, పఠాన్​ మూవీ స్త్పై యాక్షన్​ థ్రిల్లర్ సినిమాగా రూపొందింది. ఈ చిత్రంలో షారుక్​ సరసన బాలీవుడ్​ బికినీ బ్యూటీ దీపికా పదుకొణె నటించింది. జాన్​ అబ్రహం కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్​ భాయ్​ కండల వీరుడు సల్మాన్​ ఖాన్​ కెమియో​ రోల్​లో కనిపంచి ఆకట్టుకున్నారు. ఆయనకు షారుక్​ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్​గా నిలిచాయి. ఇక ఈ సినిమాకు సిద్ధార్థ్​ ఆనంద్​ దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈ సినిమాలో షారుక్​ 'పఠాన్'​ రోల్​.. హృతిక్​ రోషన్​ నటించబోతే 'వార్​ 2'లో గెస్ట్​ రోల్​గా కనిపిస్తుందని తెలిసింది. ఈ చిత్రానికి కూడా సిద్ధార్థ్​ ఆనంద్​ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదీ చూడండి: ఈ సారి వారం గ్యాప్​లో బాలయ్య-పవన్​.. ఇక ఫ్యాన్స్​కు పండగే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.