ETV Bharat / entertainment

షారుక్ ఖాన్ సినిమాకు నో చెప్పిన బన్నీ.. కారణం అదేనట! - షారుఖ్ ఖాన్ సినిమా అల్లు అర్జున్

కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్​షా షారుక్ చిత్రంలో నటించేందుకు అల్లు అర్జున్ నో చెప్పారట! అందుకు కారణం ఏంటంటే?

JAWAN MOVIE ALLU ARJUN
JAWAN MOVIE ALLU ARJUN
author img

By

Published : Mar 2, 2023, 7:11 AM IST

బాలీవుడ్ నుంచి వచ్చిన బంపర్ ఆఫర్​ను అల్లు అర్జున్ వదులుకున్నారా? పుష్ప-2 చిత్రం షూటింగ్​లో ఉన్న ఆయన.. షారుక్ సినిమాలో నటించేందుకు నో అని చెప్పారా? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు! ప్రస్తుతం షారుక్ ఖాన్ జవాన్ సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 2న ఆ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే పఠాన్​తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు షారుక్. దీంతో ఆయన తదుపరి చిత్రమైన జవాన్​పై అంచనాలు పెరిగిపోయాయి.

అయితే, ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అల్లు అర్జున్​ను చిత్ర బృందం సంప్రదించినట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. ఆ పాత్రకు ఐకాన్ స్టార్ అయితేనే సరిగ్గా సరిపోతారని మేకర్స్ భావించినట్లు సమాచారం. ఆ తర్వాత దీనిపై ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ ఆఫర్​కు బన్నీ నో చెప్పారట! పుష్ప-2 చిత్రం షూటింగ్​లో బిజీబిజీగా గడుపుతున్న అల్లు అర్జున్.. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల షారుక్ చిత్రంలో నటించనని చెప్పారట. బన్నీకి ఇష్టం లేకపోయినా షారుక్ సినిమాకు నో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

'పుష్ప- ది రైజ్​'కు సీక్వెల్​గా 'పుష్ప- ది రూల్' చిత్రం తెరకెక్కుతోంది. స్మార్ట్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మంధాన ఫీమేల్ లీడ్​గా నటిస్తోంది. ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్​తో తెరకెక్కిన 'పుష్ప- ది రైజ్'.. దేశ, విదేశీ అభిమానుల నుంచి అనేక ప్రశంసలు అందుకుంది. బాలీవుడ్​లో అంచనాలు లేకుండా రిలీజై.. సూపర్ హిట్​గా నిలిచింది. హిందీ మార్కెట్​లోనే ఏకంగా రూ.వంద కోట్లు రాబట్టింది! అల్లు అర్జున్ పాత్రకు అంతా ఫిదా అయిపోయారు. ఆయన చెప్పిన డైలాగ్​లు, మేనరిజం అందరినీ అలరించాయి. బన్నీని అనుకరిస్తూ చేసిన రీల్స్, షార్ట్స్​కు అయితే కొదువ లేదు. క్రికెటర్లు, సెలబ్రిటీలు సైతం ఆయన మూవ్స్​ను ట్రై చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు.

ఇక జవాన్ సినిమాలో షారుక్ డబుల్ రోల్ చేయనున్నారని సమాచారం. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. నయనతారను కథానాయికగా ఎంపిక చేశారు. గతంలో షారుక్​తో చెన్నై ఎక్స్​ప్రెస్ చిత్రంలో ఆడిపాడిన ప్రియమణి సైతం ఈ సినిమాలో ఉన్నారు. తమిళ డైరెక్టర్ అట్లీ.. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హిందీ, తమిళం, తెలుగు, మళయాలం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం.. యాక్షన్ థ్రిల్లర్​గా అభిమానులను అలరించనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.