ETV Bharat / entertainment

'సామ్‌-చైది చూడముచ్చటైన జంట.. ఎప్పుడూ గొడవపడలేదు'

సమంత-నాగచైతన్య పెళ్లయ్యాక ఎలా ఉండేవారో చెప్పారు సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ స్పందించారు. పెళ్లయాక వాళ్లు తమ అపార్ట్‌మెంట్స్‌లోనే ఉండేవారని, వాళ్లది చూడ ముచ్చటైన జంట అని తెలిపారు.

Senior actor Murali Mohan reacted to Samantha-Naga Chaitanya's divorce
'సామ్‌-చైది చూడముచ్చటైన జంట.. ఎప్పుడూ గొడవపడలేదు'
author img

By

Published : Jul 20, 2022, 1:56 PM IST

సమంత-నాగచైతన్య విడాకులపై తాజాగా సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ స్పందించారు. చైతన్య-సామ్‌ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లని, వాళ్లది చూడ ముచ్చటైన జంట అని తెలిపారు. అలాంటి వాళ్లిద్దరూ విడిపోవడం తనని షాక్‌కు గురి చేసిందని ఓ యూట్యూబ్‌ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. పలువురు హీరోలపై స్పందించాలని ఇంటర్వ్యూలో కోరగా.. వారి గురించి ప్రస్తావిస్తూనే నాగ చైతన్య గురించి తనకు తెలిసిన విషయాలను వెల్లడించారు.

''హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో మాకు అపార్ట్‌మెంట్స్‌ ఉన్నాయి. ఆ అపార్ట్‌మెంట్స్‌ భవనంపైన మా కుటుంబసభ్యుల కోసమే ప్రత్యేకంగా మూడు ఇళ్లను నిర్మించుకున్నాం. అందులో ఒకటి నాది, మరొకటి నా సోదరుడిది, మూడోది నా కుమారుడిది. ఓసారి చైతన్య మా అపార్ట్‌మెంట్స్‌ చూడటానికి వచ్చారు. ఆ సమయంలో మా ఇళ్లనూ చూశారు. ఆయనకు అవి బాగా నచ్చేశాయి. ఆ మూడింటిలో ఒకటి తనకి కావాలని కోరారు. దానికి నేను ఒప్పుకోలేదు. ఆ ఇళ్లను మా కుటుంబసభ్యుల కోసమే ప్రత్యేకంగా నిర్మిస్తున్నానని చెప్పా. నా మాటతో ఆయన కాస్త నిరాశకు గురయ్యారు. ఇదే విషయంపై కొన్నిరోజుల తర్వాత నాగార్జున నన్ను సంప్రదించగా.. ఆయన మాట కాదనలేక.. ఆ మూడు ఇళ్లలో ఒకదాన్ని చైతన్యకు ఇచ్చేశా''

''పెళ్లి అయ్యాక సామ్‌-చై ఆ ఇంట్లోనే ఉన్నారు. వాళ్లిద్దరూ చూడముచ్చటైన జంట. వాకింగ్‌, జిమ్‌లో వర్కౌట్లు కలిసే చేసేవారు. ఎప్పుడూ సరదాగానే కనిపించేవారు. నాకు తెలిసినంతవరకూ వాళ్లు ఎప్పుడూ గొడవపడలేదు. తిట్టుకోవడం, ఏదైనా విషయంపై వాళ్లిద్దరి మధ్య వాగ్వాదాలు జరిగిన సంఘటనలు కూడా లేవు. ఫ్రెండ్స్‌, వీకెండ్‌ పార్టీలు.. ఇలాంటివేమీ వాళ్లింటిలో జరగవు. ఆ ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉండేది. వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారన్న విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. ఓరోజు మా ఇంట్లో పనిచేసేవాళ్లు వచ్చి.. 'సర్‌.. సామ్‌-చై విడిపోయారు. చైతన్య సర్‌.. తన సామానంతా తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోయారు' అని చెప్పగా నేను షాక్‌ అయ్యాను. ఒకవేళ ముందే తెలిసి ఉంటే వాళ్లిద్దరితో మాట్లాడేవాడిని'' అని మురళీ మోహన్‌ వివరించారు.

ఇదీ చదవండి: 'ఆ ఇద్దరిపై కేసులు పెడతా.. నా సినిమాను ఆపేందుకు ప్రయత్నించారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.