Sandeep Vanga Ranbir Kapoor Animal : 'అర్జున్ రెడ్డి'.. తన మొదటి సినిమాతోనే దర్శకుడిగా సత్తా చాటారు సందీప్ రెడ్డి వంగా. ఆ చిత్రంతోనే విజయ్ దేవరకొండ సన్సేషన్ స్టార్‌గా మారిపోయారు. ఇక అదే చిత్రాన్ని హిందీలో 'కబీర్ సింగ్'గా రీమేక్ చేసి అక్కడ కూడా తన మార్క్ చూపించారు సందీప్. అది బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు మంచి వసూళ్లను అందుకుంది. ఆ జోష్‌లోనే బాలీవుడ్ మరో ఛాన్స్‌ను అందుకున్నారు సందీప్. బౌటౌన్ చాక్లెట్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి 'యానిమల్' సినిమా అనౌన్స్ చేశారు. ఇది మొదలై దాదాపు రెండేళ్లు అయింది.
Animal Movie Teaser : 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' భారీ సక్సెస్‌లను అందుకోవడంతో 'యానిమల్'పై ఆడియెన్స్ అంచనాలను ఎక్కువే పెట్టుకున్నారు. ఆ మధ్యలో రణ్‌బీర్‌కు సంబంధించిన డేంజరస్ అండ్ వైల్ట్ లుక్‌ను విడుదల చేసి సినిమాపై మరింత అంచనాలను పెంచేశారు సందీప్. అందులో గొడ్డలి పట్టుకొని ఒళ్లంతా రక్తం, గాయాలతో రణ్‌బీర్ సిగరెట్ కాలుస్తూ భయంకరంగా కనిపించారు. ఈ పోస్టర్‌తో సినిమాలో వైలెన్స్ ఏ రేంజ్లో ఉండబోతుందో చెప్పేశారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రీ టీజర్‌ను రిలీజ్ చేశారు. 50 సెకన్ల ఉన్న ఈ ప్రచార చిత్రంలో రణ్‌బీర్‌లో ఫస్ట్‌లుక్‌లో ఉన్నట్టుగా గొడ్డలిని పట్టుకుని విలన్ల గుంపును నరుక్కుంటూ వెళ్లారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ సాంగ్ వచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Ranbir Kapoor Animal teaser : ఇందులో రణ్‌బీర్‌కపూర్ హీరోగా నటించగా.. రష్మిక హీరోయిన్గా నటించింది. అనిల్ కపూర్ ఓ కీలక పాత్ర పోషించారు. మరో స్టార్ బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 11న థియేటర్లలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. హిందీ, తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే సందీప్ వంగాకు తెలుగు ఆడియన్స్ పల్స్ తెలుసు కాబట్టి.. యానిమల్ చిత్రం సౌత్ ఆడియన్స్‌ను కూడా అలరించేలా యానిమల్‌ను తెరకెక్కించారట. ఇప్పటికే 'బ్రహ్మాస్త్ర' సినిమాతో సౌత్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు రణ్‌బీర్. ఇక యానిమల్తోనూ దక్షిణాదిలో మంచి హిట్‌ను అందుకోవాలి ఆశిస్తున్నారు ఈ చాక్లెట్ బాయ్. అందుకే ఈ మూవీపై చాలానే ఆశలు పెట్టుకున్నారాయన.
ఇదీ చూడండి :
10వేల 'ఆదిపురుష్' మూవీ టికెట్లు కొన్న రణ్‌బీర్!.. వారి కోసమే..