ETV Bharat / entertainment

'సంయుక్తా.. ఆ రోజు తారక్‌తో ఏం మాట్లాడారు?' - సంయుక్తా మేనన్​ ఆర్​ ఆర్​ ఆర్​

సంయుక్తా.. ఆరోజు మీరు తారక్​తో ఏం మాట్లడారు? 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఎన్నిసార్లు చూశారు? 'బింబిసార' స్క్రిప్ట్‌ వినగానే మీ రియాక్షన్‌ ఏమిటి? ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా వింటున్న పాటలు?.. ఇవన్నీ మలయాళీ భామ సంయుక్తా మేనన్​ను అభిమానులు ట్విట్టర్​ వేదికగా అడిగిన ప్రశ్నలు. వీటికి ఆమె ఏమని సమాధానమిచ్చారంటే?

సంయుక్తా మేనన్
సంయుక్తా మేనన్
author img

By

Published : Aug 4, 2022, 1:08 PM IST

Samyuktha Menon: 'భీమ్లానాయక్‌'తో తెలుగు తెరకు పరిచయమైన మలయాళీ నటి సంయుక్తా మేనన్‌. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో వరుస ప్రాజెక్టులు చేస్తున్నారు. ఆమె కథానాయికగా నటించిన 'బింబిసార' చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్​ వేదికగా తాజాగా ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

మీ ఫోన్‌ వాల్‌ పిక్‌ ఏమిటి?
సంయుక్తా మేనన్‌: ఇదే నా వాల్‌ పిక్‌.. నాకెంతో ఇష్టమైన 'నోవా'ని మీ అందరికీ పరిచయం చేస్తున్నా.

సంయుక్తా మేనన్
.

ధనుష్‌ గురించి మీ అభిప్రాయం ఏమిటి?
సంయుక్తా మేనన్‌: క్లాస్‌, మంచి వ్యక్తిత్వం గల మనిషి.

'సార్‌' రిలీజ్‌ ఎప్పుడు?
సంయుక్తా మేనన్‌: సార్‌.. తుఫాన్‌ త్వరలోనే మీ ముందుకు రానుంది. మీ అందరికీ టీజర్‌ నచ్చిందనే అనుకుంటున్నా.

ఈ ఫొటోలో మీరు తారక్‌తో ఏం చెబుతున్నారు?
సంయుక్తా మేనన్‌: ఆయన నటనా ప్రావీణ్యం గురించి మాట్లాడుతున్నా..! మరి, ఒకవేళ తారక్‌ మీ ముందుంటే మొదట మీరేం మాట్లాడతారు?

సంయుక్తా మేనన్
సంయుక్తా మేనన్, ఎన్టీఆర్​

ఇంత తక్కువ సమయంలో తెలుగు ఎలా నేర్చుకోగలిగారు? 'బింబిసార' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మీరు చక్కగా మాట్లాడారు..!
సంయుక్తా మేనన్‌: హైదరాబాద్‌ నీకు రెండో నివాసమైనప్పుడు ఇక్కడి భాషను నువ్వు త్వరగా నేర్చుకోలేవా? లాక్‌డౌన్‌ సమయంలో జూమ్‌ క్లాసులు తీసుకొని మరీ నాకు తెలుగు నేర్పించిన ఆశా మేడమ్‌కు ధన్యవాదాలు.

మీ చిన్ననాటి ఫొటోని షేర్‌ చేయగలరు?

సంయుక్తా మేనన్
సంయుక్తా మేనన్

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ గురించి ఒక్కమాటలో చెప్పగలరు?
సంయుక్తా మేనన్‌: ఒక్కమాటలో ఆయన గురించి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన ఓ అద్భుతం.

ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా వింటోన్న పాటలు?
సంయుక్తా మేనన్‌: నీతో ఉంటే చాలు (బింబిసార), రారా రెడ్డి ఐ యామ్‌ రెడీ(మాచర్ల నియోజకవర్గం)

'బింబిసార' స్క్రిప్ట్‌ వినగానే మీ రియాక్షన్‌ ఏమిటి?
సంయుక్తా మేనన్‌: మంచి అవకాశం దొరికింది.

సంయుక్తా మేనన్
సంయుక్తా మేనన్

'ఆర్‌ఆర్‌ఆర్‌' ఎన్నిసార్లు చూశారు?
సంయుక్తా మేనన్‌: రెండుసార్లు

మహేశ్‌ గురించి ఒక్క మాటలో చెప్పమంటే..
సంయుక్తా మేనన్‌: ఎప్పటికీ ప్రకాశించే రాక్‌స్టార్‌ ఆయన.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: NBK 107: రాఖీ రోజు అదిరిపోయే సర్‌ఫ్రైజ్.. బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలే..

'నటుడిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరిచుకునే ప్రయత్నం చేశా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.