ETV Bharat / entertainment

అబ్బో.. చాలా కాలం తర్వాత సమంత అలా చేసిందిగా! - సమంత డబ్బింగ్ ఆర్టిస్ట్​ చిన్మయి

చాలా కాలం తర్వాత సమంత.. గాయని చిన్మయి గురించి ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్​ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ సంగతులు.

Samantha chinmayi tweet
అబ్బో.. చాలాం తర్వాత చిన్మయి గురించి సామ్ ట్వీట్​.. ఏమందంటే?
author img

By

Published : Feb 2, 2023, 12:47 PM IST

తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోయిన్ సమంత-గాయని చిన్మయి మధ్య ఉన్న స్నేహబంధం తెలిసిందే. అయితే గతంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయని వార్తలు కూడా వచ్చాయి. వీరద్దరు వాటిపై పరోక్షంగా కూడా స్పందించారు. తామిద్దరు బాగానే ఉన్నట్లు ఒకరి గురించి మరొకరు ట్వీట్లు కూడా చేసుకున్నారు. అయితే మళ్లీ చాలా కాలం తర్వాత తన స్నేహితురాలు చిన్మయి గురించి ఓ ట్వీట్ చేశారు సమంత. చిన్మయిని క్వీన్‌ అంటూ అభివర్ణించారు. ఎంతోకాలం తర్వాత వీరిద్దరి మధ్య ఈ సంభాషణ జరగడంతో ఇప్పుడీ ట్వీట్​ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే..

మయోసైటిస్‌ నుంచి కోలుకున్న సామ్‌.. తాజాగా సిటాడెల్‌ షూటింగ్​లో బిజీ కానుంది. తాము తెరకెక్కించనున్న సిరీస్‌లోకి సామ్‌కు స్వాగతం పలుకుతూ హాలీవుడ్‌ దర్శక ద్వయం రస్సో బ్రదర్స్‌ ఓ ట్వీట్‌ చేశారు. దీనిపై చిన్మయి భర్త రాహుల్‌ స్పందిస్తూ.. "సామ్‌ ప్రయాణం ఎలా మొదలైందో నాకింకా గుర్తుంది. హాలీవుడ్‌ ప్రముఖ దర్శకులు రస్సో బ్రదర్స్‌.. సామ్‌ను తమ ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానించడం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది" అని పేర్కొన్నారు. దీనిపై చిన్మయి స్పందిస్తూ "సమంత ఓ క్వీన్‌.. ఇదే నిదర్శనం" అని ప్రశంసించారు. దీనిపై సామ్‌ కామెంట్ చేస్తూ.. "నేను కాదు నువ్వే చిన్మయి. అలాగే రాహుల్‌ లాంటి మంచి స్నేహితుడు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం" అని బదులిచ్చింది.

'ఏం మాయ చేసావే'తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమంతకు.. తన గాత్రాన్ని అందించింది గాయని చిన్మయి. అప్పటి నుంచి సామ్‌ నటించిన అన్ని పాత్రలకూ ఆమే డబ్బింగ్‌ చెప్పేది. దీంతో వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. అయితే, యూటర్న్‌ నుంచి సామ్‌.. తెలుగులో తన పాత్రలకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడం ప్రారంభించింది. దీంతో సామ్‌-చిన్మయిల మధ్య సరిగ్గా మాటల్లేవని ప్రచారం సాగింది. అవన్నీ అవాస్తవాలు మాత్రమేనని చిన్మయి ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది.

ఇదీ చూడండి: త్రిషకు మాత్రమే అలా కుదిరిందోచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.