ETV Bharat / entertainment

ప్రేమకు దూరంగా ఉండాలనుకుంటున్నా: సమంత - సమంత ట్విట్టర్​ చాట్​

Samantha Love Tweet: ప్రేమ‌కు దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్పారు స్టార్​ హీరోయిన్​ స‌మంత‌. ఇటీవలే ఆమె నటించిన 'కాతు వాకుల​ రెండు కాదల్'​ విడుదలైన సందర్భంగా ట్విట్టర్​లో అభిమానుల‌తో ముచ్చ‌టించారు. నెటిజన్లు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పారు సామ్​.

సమంత
సమంత
author img

By

Published : Apr 30, 2022, 8:26 PM IST

Samantha Love Tweet: నాగచైతన్యతో విడిపోయిన తర్వాత స్టార్​ హీరోయిన్​ సమంత వరుస చిత్రాలో బిజీగా ఉన్నారు. ఇటీవలే సామ్​ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం 'కాతు వాకుల రెండు కాదల్'​ విడుదలైంది. అయితే ఈ మూవీపై వస్తున్న నెగటివ్​ కామెంట్స్​కు సమంత స్పందించారు. ప్రేక్ష‌కుల్ని న‌వ్వించాల‌నే ఆలోచ‌న‌తోనే తాను ఈ సినిమాలో భాగ‌మైన‌ట్లు చెప్పారు. రోజువారీ టెన్ష‌న్‌ను ప‌క్క‌న‌పెట్టి సినిమాను ఎంజాయ్ చేయమని అభిమానుల‌ను కోరారు. సినిమా రిలీజ్ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ ద్వారా ప్రేక్ష‌కుల‌తో ముచ్చ‌టించారు సామ్​.

తాను ఇప్పటివరకు క‌లిసిన వారిలో మోస్ట్ హార్డ్ వ‌ర్కింగ్ ప‌ర్స‌న్ న‌యన‌తార అంటూ స‌మంత పేర్కొన్న‌ారు. ఈ సందర్భంగా ఒకేసారి అంతులేని ప్రేమ‌, ద్వేషాన్ని స్వీక‌రించాల్సివ‌స్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంద‌ని ఓ అభిమాని ఆమెను ప్ర‌శ్నించారు. ఆ రెండింటికి దూరంగా ఉంటానని స‌మాధానం ఇచ్చారు సామ్​. అయితే అభిమానులు తనపై చూపించే ప్రేమకు కృతఙ్ఞతతో ఉంటానని చెప్పుకొచ్చారు. ప్రేమ‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని ఈ సమాధానం ద్వారా సమంత చెప్ప‌క‌నే చెప్పారని ఈ ట్వీట్ ఉద్దేశించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

ఇటీవ‌లే పుట్టిన‌రోజు జ‌రుపుకొన్న‌ స‌మంత‌ త‌న‌కు విషెస్ చెప్పిన వారికి రిప్లై ఇస్తూ అంద‌రి ప్రోత్సాహం, స్ఫూర్తితో ఈ ఏడాదిని మ‌రింత ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతాన‌ని ట్వీట్​ చేశారు. తెలుగులో ఈ ఏడాది స‌మంత న‌టించిన 'శాకుంత‌లం', 'య‌శోద' సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్ర‌స్తుతం శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌లో స‌మంత బిజీగా ఉన్నారు. సరికొత్త లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్నారు.

ఇదీ చదవండి: పవన్​- సాయి​ధరమ్​ తేజ్​ సినిమా ఫిక్స్​.. సెట్స్​పైకి అప్పుడే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.