మయోసైటిస్ వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే చిత్రీకరణలో పాల్గొంటోంది. అయితే ఇటీవలే ఈ వ్యాధి కారణంగా షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండతో నటిస్తున్న 'ఖుషి' మూవీ షూటింగ్‌కు కూడా విరామం ఇచ్చింది. దీంతో ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.
ఈ విషయంపై సామ్ ఇటీవలే మాట్లాడింది. "విజయ్ దేవరకొండ అభిమానులను నేను క్షమాపణలు అడుగుతున్నాను. ఖుషి సినిమా త్వరలోనే మళ్లీ ప్రారంభం అవుతుంది" అని ట్విట్టర్ వేదికగా తెలిపింది. కానీ కరెక్ట్‌గా ఎప్పుడు సెట్స్‌లోకి అడుగుపెడుతుందో చెప్పలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి మరో వార్త తెలిసింది. అదేంటంటే.. వచ్చే నెల మార్చి రెండో వారం నుంచి సమంత షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే.. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నటులు అలీ, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విజయ్ దేవరకొండ, సమంత తొలిసారిగా ఈ సినిమా కోసం జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
సమంత సినీ కెరీర్ విషయానికొస్తే.. త్వరలోనే ఆమె నటించిన 'శాకుంతలం' విడుదల కానుంది. ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సిటాడెల్ హిందీ రీమేక్‌లో నటిస్తోంది. ముంబయిలో ఈ షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ కూడా నటిస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదీ చూడండి: సమంత పక్కా ప్లాన్.. ఇకపై దానిపైనే ఫోకస్!