ETV Bharat / entertainment

సామ్​ బాలీవుడ్​ ఎంట్రీ.. ఆ యంగ్​హీరోకు గ్రీన్​సిగ్నల్​! - సమంత బాలీవుడ్ సినిమా

Samantha Ayushman Khurana movie: హీరోయిన్ సమంత మరో హిందీ సినిమాకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలిసింది. యంగ్​ హీరో ఆయుష్మాన్​ ఖురానాతో కలిసి ఓ మూవీ చేయనుందట. ఈ ఏడాది చివర్లో ఆ ప్రాజెక్ట్​ సెట్స్​పైకి వెళ్లనుందని టాక్​ వినిపిస్తోంది.

Samantha Ayushmann khurana movie
సమంత హిందీ సినిమా
author img

By

Published : Jul 6, 2022, 1:35 PM IST

Samantha Ayushman Khurana movie: దక్షిణాదిలో స్టార్​ హీరోయిన్​గా ఎదిగిన సమంత.. 'ఫ్యామిలీమ్యాన్​ 2' వెబ్​సిరీస్​, 'పుష్ప: ఊ అంటావా' సాంగ్​తో నార్త్​ ఆడియెన్స్​ను ఓ ఊపు ఊపేసింది. ఈ క్రమంలోనే ఆమె నేరుగా హిందీ చిత్రాల్లో నటించేందుకు దృష్టి సారించినట్లు తెలిసింది.

అయితే ఇప్పుడామె రెండు కొత్త చిత్రాలకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలిసింది. తాను నిర్మించే ఓ హిందీ ప్రాజెక్ట్​లో సామ్​ నటించనుందని ఇటీవలే తాప్సీ ధృవీకరించింది. ఇదిలా ఉండగా.. మరోవైపు యంగ్​ హీరో ఆయుష్మాన్​ ఖురానాతో కలిసి నటించేందుకు రెడీ అయిందని టాక్​ వినిపిస్తోంది. ఈ మూవీని మడాక్​ ఫిల్మ్స్, పీపింగ్ మూన్​ బ్యానర్స్​పై దినేశ్​ విజయన్​ నిర్మిస్తున్నారట. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్​ సెట్స్​పైకి వెళ్లనుందని తెలిసింది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ఈ రెండింటిలో ఏది ముందు సెట్స్​పైకి వెళ్లి రిలీజ్​ అవుతుందో చూడాలి. ఇక వరుణ్​ ధావన్​తోనూ సామ్​ ఓ వెబ్​సిరీస్​ చేస్తున్నట్లు సమాచారం. 'సిటాడెల్'​ అనే హాలీవుడ్​ యాక్షన్​ స్పై థ్రిల్లర్​ సిరీస్​కు ఇది ఇండియన్​ వెర్షన్​. రాజ్​ అండ్​ డీకే దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో వరుణ్​-సామ్​ గూఢచారులుగా కనిపించనున్నారట. 2023లో అమెజాన్​ ప్రైమ్​లో స్ట్రీమింగ్​ కానుంది. కాగా, గుణశేఖర్​ దర్శకత్వంలో సామ్​ నటించిన 'శాకుంతలం' సినిమా త్వరలోనే విడుదల కానుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'యశోద', 'ఖుషి' చిత్రాల్లో నటిస్తోంది. ​

ఇదీ చూడండి: రణ్​వీర్​ రాయల్టీ.. రూ.75 లక్షల షూస్​.. రూ.3 లక్షల డ్రెస్​​​.. లైఫ్​స్టైల్​ అదుర్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.