ETV Bharat / entertainment

మహిళల శరీరాలు విలువైనవి.. వాటిని దుస్తులతో సంరక్షిస్తేనే మంచిది : సల్మాన్​ ఖాన్​ - ఆప్​కీ అదాలత్ షో సల్మాన్​ ఖాన్​

మహిళల దుస్తుల విషయంలో గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్​ స్టార్ సల్మాన్​ ఖాన్. ఓ ఇంటర్వ్యూలో యాంకర్​ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని వివరించారు.

salman khan
salman khan
author img

By

Published : May 2, 2023, 7:43 AM IST

Updated : May 2, 2023, 8:45 AM IST

మహిళల శరీరాలు ఎంతో విలువైనవని, వాటిని దుస్తులతో ఎంత ఎక్కువగా కప్పితే అంత మంచిదని బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి ఓ ప్రముఖ టీవీ ఛానెల్​లో ప్రసారమైన 'ఆప్‌ కీ అదాలత్‌' అనే టీవీ కార్యక్రమంలో సల్మాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు సల్మాన్‌తో కలిసి 'కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌'లో ఆయనతో పాటు స్క్రీన్​ షేర్​ చేసుకున్న నటి పాలక్‌ తివారీ కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. "సల్మాన్‌ తన సినిమా సెట్లో మహిళలందరూ మెడ వరకూ నిండుగా వస్త్రాలు ధరించేలా చూస్తారు" అని పేర్కొన్నారు. దీనిపై సోషల్​ మీడియాలో స్పందించిన నెటిజన్లు సల్మాన్‌పై విమర్శలను గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో 'ఆప్‌ కీ అదాలత్‌' వ్యాఖ్యాత రజత్‌ శర్మ సల్మాన్‌ను ఓ ప్రశ్న అడిగారు. "మీ సినిమా సెట్‌లోని మహిళలకు దుస్తుల విషయంలో నియమం పెట్టే మీరు.. సినిమాల్లో మాత్రం చొక్కా విప్పి నటించడం ద్వంద్వ ప్రమాణాల కిందకు రాదా?" అని అడిగారు. "ఇందులో ద్వంద్వ ప్రమాణాలు లేవు. నా అభిప్రాయంలో మహిళల శరీరాలు విలువైనవి. వాటిని ఎంత ఎక్కువగా దుస్తులతో సంరక్షిస్తే వారికి అంత మంచిది. ఇది మహిళల గురించి చెబుతున్న మాట కాదు. మన తల్లులు, భార్యలు, సోదరీమణుల్లాంటి మహిళలను వక్రబుద్ధితో చూసే కొందరి గురించి చెబుతున్న మాట. మహిళలు అవమానాలకు గురికాకూడదని నేను కోరుకుంటున్నాను" అని ఆ వ్యాఖ్యాత ప్రశ్నకు సల్మాన్​ వివరణ ఇచ్చారు.

అంతే కాకుండా ఇదే షోలో పలు విషయాలపై మాట్లాడారు సల్మాన్​ఖాన్​. తన ప్రేమ వైఫల్యాలకు మాజీ ప్రేయసిలను నిందించనని, తప్పంతా తనదేనంటూ చెప్పుకొచ్చారు. "నేను చాలా మంది అమ్మాయిలతో లవ్​లో ఉన్నాను. కానీ ఎందుకో కానీ నాకు అదృష్టం కలిసిరాలేదు. వారంతా నన్నొదిలిపెట్టి వెళ్లిపోయారు కాబట్టి అందరూ నాదే తప్పనుకుంటున్నారు. అది నిజమే కావొచ్చు. నేను భద్రమైన జీవితాన్ని ఇవ్వలేనని వెళ్లిపోయిన వారు భావించారేమో. ఈ విషయంలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నా మాజీ ప్రేయసీలందరూ వారి వారి లైఫ్​లో బాగా సెటిలయ్యారు" అని సల్మాన్‌ అన్నారు. తనకు వస్తున్న బెదిరింపుల గురించి కూడా ఈ కార్యక్రమంలో స్పందించారు.

ఇటీవలే రంజాన్​ సందర్భంగా తన లేటెస్ట్ మూవీ 'కిసీకా భాయ్​ కిసీకీ జాన్​' రిలీజయ్యింది. ఈ సినిమాలో సల్మాన్​ సరసన పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే నటించారు. గ్రాండ్​గా రిలీజైన ఈ సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన లభించింది. మరోవైపు టైగర్​ 3 షూటింగ్​లోనూ సల్మాన్​ బిజీగా ఉన్నారు.

Last Updated : May 2, 2023, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.