ETV Bharat / entertainment

మరిన్ని దేశాల్లో 'ఆర్​ఆర్​ఆర్'​ రిలీజ్​- 'సలార్'​ గ్లింప్స్​ వైరల్​! - ఆర్​ఆర్​ఆర్​ మూవీ

ఇటీవల విడుదలైన 'ఆర్‌ఆర్ఆర్‌' సినిమా రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను మరిన్ని దేశాల్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది చిత్రబృందం. అలాగే పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ నటించిన 'సలార్​' గ్లింప్స్​కు సంబంధించిన వార్త ఒకటి వైరల్​ అవుతోంది.

salar rrr
మూవీ అప్డేట్స్​
author img

By

Published : Apr 14, 2022, 3:14 PM IST

Updated : Apr 14, 2022, 11:02 PM IST

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం 'ఆర్‌ఆర్ఆర్‌'. కొన్ని దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలైన ఈ సినిమా అన్ని చోట్లా విజయకేతనం ఎగరేసి, రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. తొలిరోజు కలెక్షన్లతో 'బాహుబలి' రికార్డులను బద్దలు కొట్టిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. అయితే ఇప్పుడీ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేశాల్లో రిలీజ్​ చేయాలని సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్​చరణ్ ఈ విషయాన్ని తెలిపినట్లు కథనాలు వస్తున్నాయి. చైనా, జపాన్​ సహా ఇతర దేశాల్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఆ వార్తల్లో సమాచారం ఉంది. ఇందుకోసం తారక్, చరణ్​​ కలిసి కొన్ని రోజుల పాటు విదేశాల్లో ప్రచారం చేయబోతున్నారట! త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్​గా తారక్‌ కనిపించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి స్వరాలు అందించారు. అలియాభట్‌ , ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలక పాత్రల్లో కనిపించారు.

సలార్​ మూవీటీమ్ శుభవార్త..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​ ఫ్యాన్స్​కు శుభవార్త వినిపించింది సలార్​ మూవీటీమ్​. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో జోష్​ నింపేందుకు ఓ కొత్త అప్డేట్​ను ఇచ్చింది. ఈ చిత్ర టీజర్​ను వచ్చే నెలలో రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది. మే చివరి వారంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సినీవిశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ సోషల్​మీడియాలో​ ట్వీట్​ చేశారు.

మరోవైపు 'కేజీఎఫ్'​ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 10వేలకు పేగా స్క్రీన్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా బ్రేక్​లో 'సలార్'​కు సంబంధించిన ఓ చిన్న గ్లింప్స్​ను ప్రసారం చేసినట్లు సోషల్​మీడియాలో వీడియోలు వైరల్​ అవుతున్నాయి. ఇందులో 'ది వైలెంట్​ మెన్​.. కాల్డ్ హిమ్​ వన్​ మ్యాన్​' ప్రభాస్​ అంటూ చూపించింది. ఇది చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. థియేటర్లో రచ్చ రచ్చ చేశారు.

ఇక సలార్​' సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించడం సహా పాన్​ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంతోనే కన్నడలోకి ప్రభాస్​ అరంగేట్రం చేయనున్నారు. ప్రభాస్​ ద్విపాత్రాభినయం చేస్తున్నారట! 'కేజీఎఫ్​' ఫేమ్​ రవి బస్రూర్​ సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ నటుడు మధు గురుస్వామి కీలకపాత్ర పోషిస్తున్నారు. శ్రుతిహాసన్​ హీరోయిన్​.

ఇదీ చదవండి: Review: 'కేజీఎఫ్'కి దీటుగా 'కేజీఎఫ్​ 2'.. ఇక బాక్సాఫీస్​ బద్దలే!

Last Updated : Apr 14, 2022, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.