ETV Bharat / entertainment

RRR controversy: రసూల్​కు కీరవాణి గట్టి కౌంటర్​.. ఆ పదాన్ని హైలైట్​ చేస్తూ.. - ఆర్​ఆర్​ఆర్ వివాదం

MM keeravani tweet RRR controversy: 'ఆర్​ఆర్​ఆర్'పై సౌండ్ ఇంజనీర్​, ప్రఖ్యాత అస్కార్​ గ్రహీత రసూల్​ పూకుట్టి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. అయితే దీనిపై స్పందించిన సంగీత దర్శకుడు రసూల్​కు గట్టి కౌంటర్​ ఇచ్చారు. అతడిని ఉద్దేశిస్తూ సోషల్​మీడియా వేదికగా వ్యంగ్యంగా ట్వీట్​ చేశారు.

MM keeravani tweet on Rasool pookutty
రసూల్​కు కీరవాణి గట్టి కౌంటర్
author img

By

Published : Jul 6, 2022, 10:07 AM IST

Updated : Jul 6, 2022, 10:16 AM IST

MM keeravani tweet RRR controversy: 'ఆర్​ఆర్​ఆర్'పై సౌండ్ ఇంజనీర్​, ప్రఖ్యాత అస్కార్​ గ్రహీత రసూల్​ పూకుట్టి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే అభిమానులు, పలువురు సెలబ్రిటీలు ఆయనకు గట్టి కౌంటర్​లు ఇచ్చారు. అయితే సంగీత దర్శకుడు కీరవాణి ఎంట్రీ అవ్వడం వల్ల ఈ వివాదం కొత్త మలువు తీసుకుంది. రసూల్​ను ఉద్దేశిస్తూ ఆయన వ్యంగ్యంగా చేసిన ట్వీట్​ ప్రస్తుతం సోషల్​మీడియాలో హాట్​ టాపిక్​గా మారింది. "ప్రతిఒక్కరి స్వేచ్ఛను గౌరవిస్తాను. ఇంగ్లీష్​ అక్షరాలు టైప్​ చేయడం సరిగ్గా రాదు. అప్పర్​ కేస్​, లోయర్​ కేస్​ టైపింగ్​లో బ్యాడ్​" ​ అంటూ రసూల్​ పూకుట్టి పేరులోని రెండు అక్షరాలను అప్పర్​ కేస్​లో టైప్​ చేసి హైలైట్​ చేశారు. అది అసభ్యపదజాలం అని నెటిజన్లకు క్లారిటీగా అర్థమవుతోంది. దీంతో ఆయన ట్వీట్​ వైరల్​గా మారింది. దీనికి కొందరు మద్దతు ఇవ్వగా.. మరికొంతమంది సరికాదంటూ కామెంట్లు చేశారు. అయితే ఆ తర్వాత ట్వీట్​ను డిలీట్​ చేశారు.

అనంతరం తన టైపింగ్​లో టైపింగ్ డిఫెక్ట్ పోయిందని, కొత్తగా క్యారెక్టర్ బ్లైండ్‌నెస్‌ వచ్చిందని పేర్కొన్నారు. తనకు రామ్, భీమ్, ఆలియా పాత్రలు కనిపించడం లేదని.. దేశభక్తుడైన అజయ్ దేవగణ్ పాత్ర ఒక్కటే కనిపిస్తోందని ట్వీట్​ చేశారు.

keeravani tweer
కీరవాణి ట్వీట్​

ఇదీ చూడండి: అలా చేశానని.. నన్ను ఆ యాంగిల్​లోనే చూస్తున్నారు: లావణ్య త్రిపాఠి

Last Updated : Jul 6, 2022, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.