ETV Bharat / entertainment

Game changer release date 2023 : 'గేమ్​ఛేంజర్​'.. ఈ సారైనా పక్కానా.. శంకర్​ ఏం చేస్తారో! - రామ్​చరణ్​ గేమ్​ ఛేంజర్ సినిమా

Ramcharan Game changer release date 2023 : మెగా పవర్​ స్టార్ రామ్​చరణ్​ 'గేమ్​ ఛేంజర్'​ రిలీజ్​ డేట్​పై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చినట్టు అర్థమవుతోంది. ఆ వివరాలు.

Game changer release date 2023 : 'గేమ్​ఛేంజర్​'.. ఈ సారైనా పక్కానా.. శంకర్​ ఏం చేస్తారో!

author img

By

Published : Aug 2, 2023, 9:35 PM IST

Ramcharan Game changer release date 2023 : దిగ్గజ డైరెక్టర్​ శంకర్ భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్​. సామాజిక అంశాల కథలకు భారీ కమర్షియల్​ హంగులను జోడించి అద్భుతంగా సినిమాలను తీర్చిదిద్దడం ఆయన స్పెషాలిటీ. లార్జన్‌ దేన్‌ లైఫ్​గా సినిమాలను రూపొందిస్తుంటారు.

ఆయితే చాలా కాలంగా తన రేంజ్​కు తగ్గట్టు భారీ హిట్​ను అందుకోలేకపోయారు. ప్రస్తుతం కమల్​ హాసన్​తో 'భారతీయుడు 2', రామ్​చరణ్​తో​ 'గేమ్​ ఛేంజర్' చేస్తున్నారు. ఇవి రెండు కూడా సోషల్​ మెసేజెస్​ సినిమాలే. వీటిని కూడా భారీ హంగులతో చిత్రీకరిస్తున్నారు. సినీ ప్రియులు కూడా ఈ రెండు చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Kamalhassan Bharatiyudu 2 release date : అయితే ఇప్పుటికే భారతీయుడు 2 రిలీజ్​పై ఓ క్లారిటీ వచ్చింది. వచ్చే సంక్రాంతికి దీన్ని తీసుకురావాలని మూవీమేకర్స్​ ప్లాన్​ చేస్తున్నారు. అయితే 'గేమ్​ ఛేంజర్'పై సినిమా రిలీజ్​ డేట్​పై ఇప్పటివరకు ఓ స్పష్టత లేదు. వాయిదా పడుతూ వస్తోంది. ఆ మధ్యలో వచ్చే ఏడాది సంక్రాంతికి ఇది వస్తుందని కథనాలు వచ్చాయి. కానీ అది కుదరదని అర్థమైపోయింది.

ఎందుకంటే మొదట భారతీయుడు 2 సినిమా షూటింగ్ ఆగిపోయింది. అది ఇక పట్టాలెక్కదని అనుకున్నారు. కానీ ఆ తర్వాత సడెన్​గా ఆగిపోయిందనుకున్న భారతీయుడు 2 ఎంట్రీ ఇచ్చింది. దీంతో అనుకున్న షెడ్యూల్స్​ అన్నీ మారిపోయాయి. ఫలితంగా 'గేమ్ ఛేంజర్'​ చిత్రీకరణ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని వచ్చే వేసవికి రిలీజ్​ చేసేలా షూటింగ్​ షెడ్యూల్స్​ను ప్లాన్ చేశారు. కానీ అది కూడా పక్కాగా చెప్పలేదు.

కానీ ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీపై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చినట్లు తెలిసింది. ఆల్మోస్ట్ దీన్నే కన్ఫామ్​ చేయాలని మేకర్స్​ అనుకుంటున్నారట. సినిమాను మార్చి మూడు లేదా నాలుగో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారని సినీ వర్గాల టాక్. అంతా అనుకున్నట్టు జరిగితే ఆ సమయంలోనే కచ్చితంగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. అంటే రెండు నెలల గ్యాప్​లో శంకర్​ తన రెండు భారీ చిత్రాలను సంక్రాంతికి భారతీయుడు 2, మార్చిలో గేమ్​ ఛేంజర్​ను.. విడుదల చేయనున్నారన్న మాట. ఈ రెండు చిత్రాల్లో ఏ ఒక్కటి భారీ హిట్​ను అందుకున్న.. ఇక శంకర్​ దూకుడును ఎవ్వరూ ఆపలేరు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.