ETV Bharat / entertainment

రవితేజ మల్టీ స్టారర్​లో విశ్వక్ సేన్​.. విలన్​గా మంచు మనోజ్​? - విశ్వక్​ సేన్ అప్​కమింగ్ మూవీస్

Ravi Teja Multi Starer : మాస్​ మహారాజా రవితేజ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న ఓ మల్టీ స్టారర్​ కోసం యంగ్​ హీరోలు విశ్వక్​ సేన్​, మంచు మనోజ్​ రెడీగా ఉన్నారట. ఇంతకీ వీరిద్దరూ ఏయే క్యారెక్టర్లు చేయనున్నారంటే ?

ravi teja and vishwak sen multi starrer
ravi teja and vishwak sen multi starrer
author img

By

Published : Jul 4, 2023, 5:16 PM IST

Ravi Teja Multi Starrer : మాస్​ మహారాజా రవితేజా త్వరలో 'టైగర్ నాగేశ్వర్​రావు'గా స్క్రీన్​పై కనిపించనున్నారు. 'రావణాసుర' తర్వాత తన అప్​కమింగ్​ మూవీస్​పై ఫోకస్​ పెట్టిన ఈ స్టార్​ హీరో.. మరికొద్ది రోజుల్లో ఇంకో భారీ ప్రాజెక్ట్​లో కనిపించనున్నారు. ఇప్పటికే మల్టీ స్టారర్స్​లో మెరిసి తనకంటూ ఓ స్టార్​డం తెచ్చుకున్న రవితేజ.. ఇప్పుడు మరో మల్టీస్టారర్​పై సైన్​ చేసి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతి కానుకగా వచ్చిన 'వాల్తేరు వీరయ్య'లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా స్క్రీన్​ షేర్ చేసుకున్న ఆయన.. తన క్యారెక్టర్​తో ప్రేక్షకులను కంటతడి పెట్టించారు. ఇప్పుడు మళ్ళీ మల్టీస్టారర్స్ మీద దృష్టి పెట్టారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Ravi Teja Color Photo Director : ఇటీవలే 'కలర్​ ఫొటో' ఫేమ్ డైరెక్టర్​ సందీప్ రాజ్ రూపొందిచనున్న ఓ సినిమాలో నటించేందుకు రవి తేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మల్టీ స్టారర్​గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజతో పాటు మరో స్టార్​ కూడా కనిపించనున్నారు. అయితే ఆ పాత్ర కోసం తొలుత యంగ్​ హీరో శర్వానంద్​ను అనుకోగా.. ఇప్పుడు శర్వాకు బదులుగా మరొక స్టార్ హీరో పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అతనే మాస్​ కా దాస్​ విశ్వక్ సేన్. అయితే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనప్పటికీ.. మూవీ మేకర్స్​ దాదాపుగా ఈ కాంబోను ఫిక్స్​ చేయనున్నట్లు టాక్​. ఇదిగనుక నిజమైతే ఇద్దరు మాస్​ హీరోల యాక్షన్​ను ఒకే స్క్రీన్​పై చూసేందుకు ఛాన్స్​ దొరుకుతుందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఈ సినిమాలో రవితేజ.. లెక్చరర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అప్పట్లో వచ్చిన 'మిరపకాయ్' సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఆయన టీచర్​గా కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఇక ఇప్పుడు మరో సారి 'సార్'​గా కనిపించనున్నారని టాక్​. అంతే కాకుండా రవితేజకు శిష్యుడి పాత్రలో విశ్వక్​సేన్ కనిపించనున్నారట. మరోవైపు ఈ సినిమాలోని ఓ నెగిటివ్​ షేడ్​ పాత్ర కోసం మూవీ మేకర్స్.. స్టార్ హీరో మంచు మనోజ్​ను అప్రోచ్​ అయ్యారట. ఆయన కూడా ఈ సినిమాలో నటించేందుకు ఇంట్రెస్ట్​ చూపించారట. అయితే ఈ విషయం కూడా ఎక్కడా అఫీషియల్​గా అనౌన్స్​ అవ్వలేదు.

Raviteja Eagle Movie : మరోవైవు మాస్​ మహారాజా వచ్చే సంక్రాంతికి సందడి చేసేందుకు సన్నాహాలు మొదలెట్టారు. 'ఈగల్' అనే మాస్​ ఎంటర్టైనర్​తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వర్ నటిస్తున్నారు. ఇక డైరెక్టర్​ కార్తీక్​ ఘట్టమనేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చి 'ధమాకా' మూవీ ఎంత పెద్ద హిట్ కొట్టిందో తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.