ETV Bharat / entertainment

సెట్​లో రవితేజకు గాయాలు.. 10 కుట్లు.. ఆ సీన్​ షూటింగ్​లో..! - రవితేజకు గాయాలు

Ravi Teja Injured: మాస్​ మహారాజా రవితేజ ఓ సినిమా షూటింగ్​లో భాగంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఆయన నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రానికి సంబంధించి ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

tiger nageswara rao
Ravi Teja injured
author img

By

Published : Jun 16, 2022, 10:29 PM IST

Ravi Teja Injured: ప్రముఖ నటుడు, మాస్ మహారాజా రవితేజ తన సినిమా చిత్రీకరణలో గాయాల పాలయ్యారు. మోకాలికి దెబ్బతగడం వల్ల సుమారు 10 కుట్లు పడ్డాయని తెలిసింది. 'టైగర్‌ నాగేశ్వరరావు' సినిమా షూటింగ్‌లో కొన్ని రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఓ యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో రవితేజ పట్టుకున్న తాడు జారిపోవడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. పూర్తిగా విశ్రాంతి తీసుకోకుండానే రవితేజ గురువారం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారట. తనవల్ల ఇతర నటులు, సాంకేతిక నిపుణుల డేట్స్‌లో మార్పు రాకూడదని, నిర్మాత ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఇలా చేశారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

tiger nageswara rao
'టైగర్‌ నాగేశ్వరరావు' ప్రారంభోత్సవం సందర్భంగా..

స్టూవర్ట్‌పురం గజదొంగ జీవితాధారంగా ఈ సినిమా రూపొందుతోంది. 1970ల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రవితేజ ఇప్పటివరకూ ప్రేక్షకులు చూడని గెటప్‌లో కనిపించనున్నారు. 'దొంగాట' ఫేం వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలకానుంది. ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

tiger nageswara rao
నుపుర్ సనన్

మరోవైపు, రవితేజ నటించిన 'రామారావు ఆన్‌ డ్యూటీ' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు 'ధమాకా', 'రావణాసుర' సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి.

tiger nageswara rao
గాయత్రి

ఇదీ చూడండి: ఇన్నేళ్లకు మాజీ లవర్​తో రణ్​బీర్​.. 'బ్రహ్మాస్త్రం'లో దీపిక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.