ETV Bharat / entertainment

అభిమానుల మనసు దోచుకున్న రష్మిక - రష్మిక పుష్ప 2

Rashmika: రష్మిక చేసిన ఓ పని అభిమానుల మనసు దోచుకుంది. నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అసలేం జరిగిందంటే...

Rashmika wins Fans Heart
అభిమానుల మనసు దోచుకున్న రష్మిక
author img

By

Published : Jun 14, 2022, 12:20 PM IST

Rashmika: తనను చూడటానికి వచ్చిన అభిమానుల పట్ల రష్మిక వ్యవహరించిన తీరు అభిమానుల మనసు దోచుకుంది. ఫొటో దిగేందుకు వస్తోన్న ఓ ఫ్యాన్​ను బౌన్సర్‌ అడ్డుకోవడంతో వదలమని చెబుతున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

తాజాగా ఓ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న రష్మికను చూడటానికి ఆమె అభిమానులు స్టూడియోకు వచ్చారు. చిత్రీకరణ పూర్తయిన తర్వాత వ్యానులోకి వెళ్తుండగా గేటు వద్దకు వచ్చి నిలబడ్డారు. అదే సమయంలో ఓ అభిమాని ఫొటో దిగేందుకు రష్మిక వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా, అక్కడే ఉన్న బౌన్సర్లు అడ్డుకున్నాడు. దీంతో వెంటనే స్పందించిన రష్మిక.. అతడిని వదలమని ఆదేశించారు. ఈ ఫొటోలన్నీ తీసుకుని ఏం చేస్తారు? అని అభిమానిని అడిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

రష్మిక తెలుగుతో పాటూ ఇతర భాష చిత్రాల్లోనూ నటిస్తున్నారు. విజయ్‌-వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాతో పాటు, సిద్ధార్థ్‌ మల్హోత్ర మిషన్‌ మజ్ను, అమితాబ్‌ 'గుడ్‌ బై', దుల్కర్‌సల్మాన్‌ 'సీతా రామమ్‌' అల్లు అర్జున్ 'పుష్ప-2'చిత్రాల్లో నటిస్తోంది.

ఇదీ చూడండి: దర్శకనిర్మాతలకు నయనతార కండిషన్​.. కారణమిదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.