ETV Bharat / entertainment

డిఫరెంట్​ స్టైల్​లో రష్మిక న్యూ మూవీ అనౌన్స్​మెంట్​​.. మళ్లీ 'భీష్మ' కాంబోనే - రష్మిక నితిన్ కొత్త సినిమా

హీరో నితిన్- హీరోయిన్​ రష్మికా మందన్న-దర్శకుడు వెంకీ కుడుముల కలిసి తమ కొత్త సినిమాను ప్రకటించారు. తమ కాంబో రిపీట్​ కానుందని తెలిపారు. ఓ స్పెషల్​ వీడియోను డిఫరెంట్ స్టైల్​లో రిలీజ్ చేశారు. అది అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. దాన్ని మీరు చూసేయండి..

Rashmika nithin venky kudumala trio repeat new movie announced
రష్మిక కొత్త తెలుగు సినిమా అనౌన్స్​మెంట్​.. మళ్లీ 'భీష్మ' కాంబోనే.. కాకపోతే..
author img

By

Published : Mar 22, 2023, 6:56 PM IST

హీరో నితిన్- హీరోయిన్​ రష్మికా మందన్న-దర్శకుడు వెంకీ కుడుముల అనగానే గుర్తొచ్చేది 'భీష్మ' సినిమా. ఈ చిత్రం బాక్సాఫీస్​ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడీ కాంబో మరోసారి రిపీట్ కానుంది. నితిన్, రష్మిక, వెంకీ కుడుముల.. కలిసి మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఉగాది సందర్భంగా తమ కొత్త చిత్రాన్ని అనౌన్స్​ చేశారు. అదీ కూడా డిఫరెంట్​ స్టైల్​లో. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సెటైర్లు వేసుకుంటూ ఓ స్పెషల్​ వీడియోను రిలీజ్​ చేశారు.

'భీష్మ' కన్నా ముందు 'ఛలో' సినిమాకు వెంకీ కుడుముల డైరెక్ట్​ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా ఆయనకు తొలి సినిమా ఇది. రష్మికకు తెలుగులో ఇదే ఫస్ట్​ మూవీ. ఈ చిత్రం హిట్​ అయింది. ఆ తర్వాత వెంకీ కుడుముల తీసిన భీష్మ కూడా సక్సెస్​ సాధించింది. ఇందులో కూడా రష్మికనే హీరోయిన్​. దీంతో తాజా వీడియోలో.. నితిన్​ మాట్లాడుతూ.. వెంకీ కుడుముల స్క్రిప్ట్ రాయడం కన్నా ముందు, ఓం కాకుండా రష్మిక పేరే రాసుకుంటాడని అని సరాదాగా కామెంట్ చేశారు.

నితిన్​ ఓ రూమ్​లోకి ఎంట్రీ ఇచ్చి.. 'ప్రభా.. ఎవరూ ఇంకా రాలేదా?' అని అడగగా.. 'హీరోయిన్ ఉదయం 8 గంటలకే వచ్చారు' అని సమాధానం వినిపిస్తుంది. 'ఎనిమిది గంటలకా.. సేమ్ హీరోయినా?' అంటూ నితిన్ మళ్లీ అనగా.. ఇంతలో రష్మిక ఎంట్రీ ఇస్తుంది. ' హా సేమ్ హీరోయినే.. డౌటా?' అని రిప్లై ఇస్తుంది. 'అస్సలు డౌట్​ లేదమ్మా... మన డైరెక్టర్ స్క్రిప్ట్​లో ఓం కన్నా ముందు నీ పేరే రాస్తాడుగా. నాకు తెలుసు' అని నితిన్ సరదాగా అంటారు.

రష్మిక కాంట్రవర్సీలు.. నితిన్ వరుస ఫ్లాపులు... రీసెంట్​గా రష్మిక చేసిన కొన్ని కామెంట్స్​ కాంట్రవర్సీకి దారీ తీశాయి. అయితే ఈ విషయాన్ని వీడియోలోకి తీసుకొచ్చారు. '8 గంటలకు వచ్చి ఏం చేస్తున్నావ్?' అని నితిన్ అడగగా.. 'దిల్లీ, బాంబే అభిమానులతో ఇప్పటి వరకు ఇన్​స్టాగ్రామ్​ లైవ్ మాట్లాడా. ఈ షూట్ తర్వాత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చిన్..' అంటూ రష్మిక చెప్పుకుంటూ పోతే.. 'నేషనల్ క్రష్ కదా ఆ మాత్రం ఉంటుందిలే' అని నితిన్​ చెబుతారు.

'లైవ్ యేనా? కాంట్రవర్సీలు కూడా ఏమైనా?' అని మళ్లీ నితిన్ అడగగా.. 'అక్కడికి వెళ్లొద్దు. నేను ఒకటి మాట్లాడితే అది రెండు మూడు కాంట్రవర్సీలు అవుతున్నాయి' అంటూ రష్మిక సమాధానం చెబుతుంది. 'అది చాలా బెటర్. నేను ఒక్క హిట్ ఇస్తే రెండు మూడు ఫ్లాపులు అవుతున్నాయ్' అంటూ నితిన్ తన గురించి తానే చెప్పుకున్నారు. ఆ తర్వాత ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్​ కుమార్​ను​ వీడియోలో పరిచయం చేశారు. అయితే అది కూడా ఫన్నీ మోడ్​లోనే చెప్పారు. దర్శకుడు వెంకీ కూడా ఈ వీడియోలో కనిపించి హాస్యం పండించారు. కాగా, భీష్మ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్​గా స్వర సాగర్​ మహతి వ్యవహరించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​కు సునీల్‌ కండీషన్‌. ఏంటంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.