ETV Bharat / entertainment

రణ్​వీర్​ న్యూడ్​ ఫొటోషూట్​ కేసులో ట్విస్ట్​.. ఆ ఫొటోను మార్ఫింగ్ చేశారట! - రణ్​వీర్ సింగ్ లేటెస్ట్ న్యూస్​

బాలీవుడ్ స్టార్ హీరో రణ్​వీర్ సింగ్​ న్యూడ్​ ఫొటోషూట్​ కేసులో ఓ ట్విస్ట్​ చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఏంటంటే..

Ranveersingh Nude photoshoot morphed
రణ్​వీర్ సింగ్ న్యూడ్​
author img

By

Published : Sep 15, 2022, 2:07 PM IST

Updated : Sep 15, 2022, 3:21 PM IST

సామాజిక మాధ్యమాల్లో నగ్న ఫొటోలు పోస్ట్‌ చేసిన వ్యవహారంలో బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్​కు పోలీసులు కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడు ఆగస్టు 29న పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. అతడి స్టేట్​మెంట్​ను పోలీసులు రికార్డు చేశారు. అయితే తాజాగా ఆ స్టేట్​మెంట్​లో రణ్​వీర్​ ఏం చెప్పాడో పోలీసులు వెల్లడించారు. ఈ న్యూడ్​ ఫొటోస్​ ఓ ట్విస్ట్​ చోటు చేసుకుందని అన్నారు.

తాను పోస్ట్ చేసిన నగ్న ఫొటోల్లో ఒకటి మార్ఫింగ్​ చేశారని రణ్​వీర్​ చెప్పారట. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. తాను పోస్ట్​ చేసిన ఆ న్యూడ్​ ఫొటోలో అండర్​వేర్​ వేసుకున్నట్లు రణ్​వీర్​ చెప్పినట్లు వెల్లడించారు. ఆ ఫొటో మార్ఫింగ్ చేశారని పోలీసులతో రణ్​వీర్ చెప్పారట! అయితే దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ ఫొటో మార్ఫింగ్​ అయిందా లేదా అని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్​​ ల్యాబ్​కు పంపించినట్లు చెప్పారు.

కాగా, రణ్‌వీర్‌ తన నగ్న ఫొటోలను పోస్ట్‌ చేయడం ద్వారా మహిళల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడంతో పాటు వారిని అవమానపరిచారంటూ ఓ ఎన్ జీవో పాటు ఓ మహిళా న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు కేసు నమోదు చేసి రణ్​వీర్​ను విచారణకు పిలిచి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఒకే టైటిల్​తో ఎన్టీఆర్​-నాగార్జున సినిమా.. ఏది హిట్ అయిందంటే?

Last Updated : Sep 15, 2022, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.