ETV Bharat / entertainment

అప్పుడు రామలక్ష్మి ఇప్పుడు​ వెన్నెల.. అడియెన్స్​కు ఫుల్​గా కనెక్ట్! - samantha ramalaxmi role in rangasthalam

గతంలో రంగస్థలం సినిమాలో సమంత రామలక్ష్మి పాత్ర ప్రేక్షకులకు ఎంతలా కనెక్ట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు అదే రేంజ్​లో దసరా సినిమాలోని కీర్తిసురేశ్​ వెన్నెల పాత్ర కూడా ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకుంటోంది. ఆ వివరాలు..

Keerthy suresh Samantha
Eరామలక్ష్మి వర్సెస్​ వెన్నెల.. మీకు ఎవరు నచ్చారబ్బా?
author img

By

Published : Apr 3, 2023, 12:59 PM IST

చిత్రసీమలో కమర్షియల్​ హీరోల చిత్రాల్లో హీరోయిన్ల పాత్రకు ప్రాధాన్యత దక్కడం అరుదుగా జరుగుతుంటుంది. చాలా వరకు వారిని గ్లామర్​ ఒలకబోయడానికి, పాటలు, డ్యాన్స్​కే పరిమితం చేస్తుంటారు. వారికి ఛాలెంజ్​ విసిరే పాత్రలు దొరకడం కష్టమనే చెప్పాలి. కానీ కొన్ని సందర్భాల్లో వారికి అదృష్టం కలిసొచ్చో, టాలెంట్​ వల్లో సవాల్ విసిరే రోల్స్​ దొరుకుతుంటాయి. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్లు.. ఆ పాత్రల్లో ప్రేక్షకుల, అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా చోటు దక్కించుకుంటుంటారు. ఇంకా చెప్పాలంటే ఆ పాత్రల పేరుతోనే వారిని ఇక ముందు పిలుచుకునేలా సదరు హీరోయిన్లు గుర్తుండిపోతారు.

రీసెంట్​గా నేచురల్ స్టార్ నాని నటించిన పక్కా యాక్షన్ థ్రిల్లర్​ సినిమా 'దసరా' రిలీజైన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా కథతో పాటు ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేశ్​ నటన, లుక్స్​ అటు ఆడియెన్స్​తో పాటు ఇటు అభిమానులను గట్టిగా కట్టిపడేశాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు.. సినిమాతో పాటు వారిద్దరి గురించే ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక హీరోయిన్ కీర్తిసురేశ్​ వెన్నెల పాత్ర విషయానికొస్తే.. ఈ సినిమా కథ మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంటుంది! ముఖ్యంగా లవ్​ అండ్ ఎమోషనల్ సీన్స్​లో ఆమె నటించిన తీరు, అలాగే సంప్రాదయ తెలంగాణ బీట్​కు ఆమె డ్యాన్స్​ వేసిన జోరు.. అందర్నీ ఫిదా చేస్తున్నాయి. తెలంగాణ యాస కూడా నేర్చుకుని మరీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.

సావిత్రి 'మహానటి' వంటి బిగ్గెస్ట్ హిట్​ తర్వాత పెర్ఫార్మన్స్ పరంగా ఆమెకు దక్కిన స్కోప్ ఉన్న పాత్రలో ఇది రెండోది అని చెప్పాలి. ఎందుకంటే మిస్ ఇండియా, పెంగ్విన్, సాని కాయిదమ్​, గుడ్ లక్ సఖి లాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు ఆమె చేసినప్పటికీ.. అంతగా ఆమెకు భారీ స్థాయిలో ప్రశంసలు దక్కలేదు. కానీ వెన్నెల పాత్ర ఆమెకు స్పెషల్​గా నిలిచిపోతుందనే చెప్పాలి. అయితే మిగితా హీరోయిన్ల విషయానికొస్తే.. ఇలాంటి తరహా పాత్రలో ఇప్పటికే సమంత గతంలో నటించింది. గతంలో రామ్​చరణ్​ 'రంగస్థలం'లో రామలక్ష్మిగా ఆడియెన్స్​ను కట్టిపడేసింది. అప్పటికే వరకు గ్లామర్​ రోల్స్​కు పరిమితమైన ఆమె.. ఈ చిత్రంతో తనలోని మరో కోణాన్ని చూపించింది. పొగరు దూకుడు కలగలిసిన పల్లెటూరి అమ్మాయిగా బాగా పెర్​ఫార్మెన్స్​ కూడా చేసింది. అయితే సొంతంగా మాత్రం డబ్బింగ్ చెప్పలేదు. కానీ చూడటానికి ఈ వెన్నెల, రామలక్ష్మి క్యారెక్టర్ల లుక్స్​, పాత్రలు కాస్త దగ్గరగా ఉంటూ.. ఆడియెన్స్​కు ఫ్రెష్​నెస్​ను​ ఇచ్చాయి. . అలా రెండు పాత్రలు బాగా కనెక్ట్​ అయ్యాయి. ఒకవేళ ఈ రెండు పాత్రలను పోలుస్తూ ఎవరు బాగా చేశారంటే మాత్రం.. ఇద్దరూ అద్భుతంగా నటించారని చెప్పొచ్చు. కాబట్టి దీన్ని జడ్జ్​ చేయడం అంత సులభం కాదు.

ఇంకో విషయమేమిటంటే.. 'రంగస్థలాన్ని' దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా.. ఆయన శిష్యుడు శ్రీకాంత్​ ఓదెల తన తొలి సినిమాగా ఈ 'దసరా'ను డెరెక్ట్​ చేశారు. అలా ఈ గురుశిష్యులు.. ప్రేక్షకుల్లో.. సమంత, కీర్తిసురేశ్​ను ఎప్పటికీ ఆయా పాత్రలతో గుర్తిండిపోయేలా చేశారు.

ఇదీ చూడండి: మరో కొత్త సినిమాకు రష్మిక గ్రీన్ సిగ్నల్.. ఈ సారి అలా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.