ETV Bharat / entertainment

'రంగబలి' టు 'భాగ్​ సాలే' ఈ వారం సినిమాల ఫైనల్ రివ్యూ.. అదొక్కటే టాప్​! - samajavaragamana ott release

This week release movies review : ఎప్పటిలాగే ఈ వారం కూడా చాలా సినిమాలే బాక్సాఫీస్​ ముందు ఆడియెన్స్​ను అలరించేందుకు ముందుకొచ్చాయి. వాటిలో అన్ని మీడియం బడ్జెట్​ చిత్రాలే ఎక్కువే. అయితే అవన్నీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. కానీ 'ఆ' ఒక్క చిత్రం మాత్రమే గతవారం విడుదలై ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆ వివరాలు..

This week hit movies
'రంగబలి' టు 'భాగ్​ సాలే' ఈ వారం సినిమాల ఫైనల్ రివ్యూ.. అదొక్కటే టాప్​
author img

By

Published : Jul 8, 2023, 11:56 AM IST

This week release movies review : ప్రతీ వారం థియేటర్లు, ఓటీటీల్లో కొత్త సినిమాలు విడుదలై ఆడియెన్స్​ను అలరిస్తుంటాయి. కానీ వాటిలో అన్నీ ఆకట్టుకోలేవు. ఒక్కోసారి అన్నీ ఫెయిల్ అవుతుంటాయి. అలానే ఈ వారం ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న కొన్ని చిత్రాలు.. మంచి అంచనాలతో విడుదలై ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి.

  • ప్రేక్షకుల్ని మొదటగా ఆకట్టుకున్న సినిమా హీరో నాగశౌర్య 'రంగబలి'. ప్రమోషన్స్​ కూడా బాగా హైప్​ పెంచాయి. ముఖ్యంగా కమెడియన్ సత్య స్ఫూప్​ ఇంటర్వ్యూ బాగా ట్రెండ్ అయింది. దీంతో 'రంగబలి'పై ఇంట్రెస్ట్ కలిసింది. క‌థా నేప‌థ్యం, నాగ‌శౌర్య న‌ట‌న‌, యాక్షన్‌, స‌త్య కామెడీ.. ఈ చిత్రానికి బలంగా నిలిచాయి. ద్వితీయార్ధం, పాట‌లు, పతాక సన్నివేశాలు ఈ సినిమాకు బ‌ల‌హీన‌త‌లు. మొత్తంగా ఈ చిత్రం మిశ్రమ స్పందనను అందుకుంది.
  • ఇక కీరవాణి తనయుడు శ్రీ సింహా నటించిన క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్​ 'భాగ్ సాలే'. ఇది కూడా ప్ర‌చార చిత్రాలతో ఆక‌ట్టుకుని ఆడియెన్స్ దృష్టిని బాగానే ఆక‌ర్షించింది. కానీ ఇది ఏమాత్రం ఆకట్టుకోలేదని జనాలు అంటున్నారు.
  • టాలీవుడ్​లో టైం ట్రావెల్ కాన్సెప్ట్​తో వచ్చిన '7:11 పీఎం' కూడా.. హాలీవుడ్ రేంజ్​లో.. ప్రచార చిత్రాలతో ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఈ చిత్రం ఏదైనా మ్యాజిక్ చేస్తుందా అని అంతా అనుకున్నారు. మొత్తంగా ఈ చిత్రం ప్రయత్నం బాగానే ఉన్నా.. ఆడియెన్స్​కు రీచ్ కాలేకపోయింది.
  • ఇక తెలంగాణ నేపథ్యంలో వచ్చిన పీరియాడిక్ డ్రామా 'రుద్రాంగి'. సీనియర్ నటుడు జగపతి బాబు, మమతా మోహన్ దాస్ నటన బాగా మెప్పించింది. 'బాహుబలి'కి డైలాగ్ రైటర్​గా పనిచేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకుడు. దీంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. కానీ ఈ సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్​కు కనెక్ట్ కాలేకోపయింది.
  • వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహించిన 'సర్కిల్​'.. అంతగా ప్రభావం చూపలేకోపోయింది. ఇందులో సాయి రోనక్, అర్షిణ్‌ మెహతా,బాబా భాస్కర్, రిచా పనై తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మొత్తంగా ఈ వారం చిత్రాలతో పోలిస్తే.. గతవారం ఎలాంటి బజ్​ లేకుండా వచ్చిన శ్రీవిష్ణు 'సామజవరగమన'నే ఇంకా బాక్సాఫీస్ వద్ద సక్సెస్​ఫుల్​గా రన్​ అవుతోంది. మంచి కలెక్షన్లను అందుకుంటోందని తెలుస్తోంది.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి:

చీరకట్టులో 'ఐశ్వర్య'.. ఆ అందాలు చూస్తుంటే..

నేహా సోలంకి.. అందాల నౌటంకీ.. చూస్తే గుండె జిగేల్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.