ETV Bharat / entertainment

దసరా రేసులో రామ్- బోయపాటి సినిమా.. పోస్టర్​ అదిరింది - రామ్​పోతినేని బోయపాటి దసరా మూవీ రిలీజ్​

హీరో రామ్​ పోతినేని-బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రిలీజ్ డేట్​ను ఖరారు చేసుకుంది. దసరాకు థియేటర్లలో రిలీజ్ కానుంది.

Rampotineni
దసరా రేసులో రామ్- బోయపాటి సినిమా.. పోస్టర్​ అదిరింది
author img

By

Published : Mar 27, 2023, 7:45 PM IST

Updated : Mar 27, 2023, 8:12 PM IST

ఎనర్జిటిక్​ స్టార్​ రామ్​ పోతినేని- దర్శకుడు బోయపాటి కాంబినేషన్​లో ఓ మాస్ యాక్షన్​ ఎంటర్​టైనర్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ​ చిత్రం విడుదల తేదీని మేకర్స్​ అధికారికంగా ప్రకటించారు. ఇంకా టైటిల్​ పెట్టని ఈ సినిమాను దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 20న వరల్డ్​వైడ్​గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్​ ఇండియా స్థాయిలో దీన్ని విడుదల చేయనున్నారు. 'ది వారియర్' తర్వాత రామ్ - 'అఖండ' తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్​లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇకపోతే ఈ సినిమాలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యంగ్​ అండ్​ బ్యూటిఫుల్ హీరోయిన్​​ శ్రీలీల రామ్ సరసన నటిస్తోంది. రీసెంట్​గా ఈ ముద్దుగుమ్మ రవితేజ ధమాకా సూపర్​ హిట్​ను తన ఖాతాలో వేసుకుంది. దర్శకుడు బోయపాటి శ్రీను సినిమా అంటే మాస్​ అండ్ యాక్షన్​ సీన్స్​ ఏ రేంజ్​​లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే ఆయన... గతేడాది నందమూరి నటసింహం బాలకృష్ణతో తెరకెక్కించిన 'అఖండ'తో సూపర్​ హిట్​ను అందుకుని ఫుల్​ జోష్​ మీదున్నారు. అలా వీరిద్దరు ఈ సినిమా కోసం పనిచేయడంతో.. ఈ కొత్త సినిమాపై అభిమానుల్లో భారీ రేంజ్​లో అంచనాలు ఉన్నాయి. ఇందులో హీరో రామ్ పక్కా మాస్ గెటప్​లో కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్​ స్క్రీన్​ బ్యానర్​పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇక హీరో రామ్ విషయానికొస్తే.. చివరగా 'ది వారియర్' సినిమాతో తమిళ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్​ ముందు నిరాశపరిచింది. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆయన ఈ కొత్త సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు.

హిందీలో ఓకే.. మరి తమిళంలో.. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది. ఇప్పటికీ రామ్​.. యూట్యూబ్ డబ్బింగ్‌ సినిమాల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇక 'అఖండ'తో దేశవ్యాప్తంగా బోయపాటి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయన గత సినిమాలు కూడా హిందీ డబ్బింగ్ వెర్షన్లలో మంచి వ్యూస్​ను అందుకున్నాయి. కాబట్టి ఈ సినిమాకు కాస్త ఎక్కువ ప్రమోషన్​ చేస్తే.. హిందీలో మంచి ఓపెనింగ్స్​ వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే తమిళంలో రామ్​.. లింగుస్వామి దర్శకత్వంలో 'ది వారియర్' సినిమాతో అక్కడి ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అది కాస్త నిరాశపరిచింది. అయితే అక్టోబర్ 19వ తేదీన తమిళంలో విజయ్ దళపతి-లోకేష్ కనగరాజ్‌ కాంబోలో 'లియో' విడుదల కానుంది. ఈ సినిమా కోసం అక్కడి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సినిమా.. బోయపాటి చిత్రానికి గట్టి పోటినిచ్చే అవకాశముంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Rampotineni
దసరా రేసులో రామ్- బోయపాటి సినిమా

ఇదీ చూడండి: ఆమె రాత్రికి రమ్మంది!.. క్యాస్టింగ్ కౌచ్​పై 'రేసు గుర్రం' యాక్టర్ షాకింగ్ కామెంట్స్​

Last Updated : Mar 27, 2023, 8:12 PM IST

For All Latest Updates

TAGGED:

Rampotineni
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.