ETV Bharat / entertainment

ఇది కదా చరణ్‌ డెడికేషన్‌ అంటే.. శంకర్ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో - రామ్​చరణ్​ ఆర్ సీ 15 వర్కౌట్స్​ వీడియో

మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ తన కొత్త సినిమా కోసం విపరీతంగా కసరత్తులు చేస్తూ చెమటోడుస్తున్నారు. ఆర్​సీ 15 కోసం నిర్విరామంగా కసరత్తులు చేస్తున్న వీడియోను సోషల్​మీడియాలో పోస్ట్ చేశారు. అది కొద్ది సేపటిలోనే నెట్టింట్లో ఫుల్​ ట్రెండ్ అవుతోంది.

Ramcharan workout video
ఇది కదా చరణ్‌ డెడికేషన్‌ అంటే.. శంకర్ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో
author img

By

Published : Nov 17, 2022, 3:55 PM IST

పాత్ర ఏదైనా అందుకు తగ్గట్టు ఆహార్యాన్ని మార్చుకోవడంలో ముందుంటారు మన కథనాయకులు. వారిలో మెగా పవర్​స్టార్ రామ్​చరణ్ ఒకరు. పాత్రలు సవాలు విసిరితే దాన్ని స్వీకరించి, అభిమానులను అలరిస్తుంటారు. ఇప్పటికే 'ధృవ', 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలతో తన బాడీ లుక్స్​ను మార్చి విశేషంగా ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు కొత్త చిత్రం ఆర్​సీ 15 కోసం నిర్విరామంగా కసరత్తులు చేస్తున్నారు. సంబంధిత వీడియోను చరణ్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. అది క్షణాల్లోనే లక్షల లైక్స్‌ సొంతం చేసుకుంది.

అందులో.. ఓ శిక్షకుడి పర్యవేక్షణలో బరువులు ఎత్తుతూ, ఫుట్‌బాల్‌ ఆడుతూ, స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడుతూ కనిపించారు చరణ్‌. 'తదుపరి షెడ్యూల్‌ చిత్రీకరణకు అంతా సిద్ధం. వర్కౌట్‌కి వెకేషన్‌ లేదు' అని క్యాప్షన్ జోడించారు. 'డెడికేషన్‌ అంటే ఇది', 'సూపర్‌ అన్నా', 'లుక్‌ బాగుంది' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'ఆర్‌సీ 15'. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న సినిమాలో కియారా అడ్వాణీ కథానాయిక. ఎస్‌. జె. సూర్య, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం.

ఇదీ చూడండి: సినిమా లవర్స్​ గెట్ రెడీ ఒకే రోజు 24 సినిమాలు రిలీజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.