ETV Bharat / entertainment

RC 15: టెన్షన్​లో ఫ్యాన్స్​!.. ఏం జరిగిందంటే? - రామ్​చరణ్​ శంకర్​ సినిమా

RC 15 movie: మెగాపవర్​స్టార్ రామ్​చరణ్​-దర్శకుడు శంకర్​ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'ఆర్​సీ 15' సినిమా విషయంలో ఫ్యాన్స్​ కాస్త ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే?

Ramcharan Shankar movie RC 15 Fans in tension
RC 15: టెన్షన్​లో ఫ్యాన్స్​!.. ఏం జరిగిందంటే?
author img

By

Published : Jul 17, 2022, 6:59 PM IST

RC 15 movie: మెగాపవర్​స్టార్ రామ్​చరణ్​-దర్శకుడు శంకర్​ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'ఆర్​సీ 15'. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈసినిమా కోసం చరణ్‌ బాగా శ్రమిస్తున్నారు. పవర్‌ఫుల్‌ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్​లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఈ సినిమా విషయంలో మెగాఫ్యాన్స్ కాస్త టెన్షన్​ పడుతున్నారు. ఎందుకంటే 'ద వారియర్'​ సినిమా మిశ్రమ స్పందన అందుకోవడం వల్ల ఈ ఆందోళన ప్రారంభమైంది. గతకొన్నాళ్లుగా మన హీరోలు తమిళ దర్శకులతో చేస్తున్న సినిమాలు పెద్దగా వర్కౌట్​ అవ్వకపోవడమే కారణం.

కొంతకాలం క్రితం నాగచైత్యన-గౌతమ్​ మేనన్​ కలయికలో వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో, మహేశ్​బాబు-మురగదాస్​ కాంబినేషన్​లో వచ్చిన స్పైడర్​ డిజాస్టర్​గా నిలిచాయి. ఆ తర్వాత విజయ్​దేవరకొండ-ఆనంద్​ శంకర్​ కలిసి చేసిన నోట ఫెయిల్యూర్​గా నిలిచింది. రీసెంట్​గా వచ్చిన హీరో రామ్​-లింగుస్వామి కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదురొన్నారు. వీళ్ల కాంబోలో వచ్చిన 'ది వారియర్​' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో తమిళ దర్శకులు తెలుగు స్టార్స్​కి షాక్​లు ఇస్తుండటం వల్ల ఇప్పుడు అందరి దృష్టిశంకర్​పై పడింది. మరోవైపు దక్షిణాదిలో టాప్​ డైరెక్టర్​గా పేరు గాంచిన శంకర్​ తెరకెక్కించిన చివరి రెండు సినిమాలు 'ఐ', 'రోబో 2.0' నిరాశపరిచాయి. మరి ఈ చిత్రంతో శంకర్​ కమ్​ బ్యాక్​ ఇస్తారో లేదో చూడాలి. అలాగే తన ఫామ్​ను కోల్పోయిన శంకర్​ మునపటిలా హిట్​ కొడతారా? తెలుగు హీరోలు-తమిళ దర్శకుల కాంబో ఫ్లాప్​​ సెంటిమెంట్​ను శంకర్​ బ్రేక్​ చేస్తారా? అనేది చూడాలి. ఏదేమైనప్పటికీ శంకర్​-రామ్​చరణ్​ సూపర్​ హిట్​ అవ్వాలని ఫ్యాన్స్​ ఆశిస్తున్నారు.

కాగా, ఆర్​సీ 15ను దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 60శాతం వరకు చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. డిసెంబర్‌ నాటికి మొత్తం పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ మూడు భిన్నమైన గెటప్పుల్లో కనిపించనున్నారు. సంగీతం- తమన్‌, మాటలు- సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం- తిరు, ఆర్‌.రత్నవేలు అందిస్తున్నారు.

ఇదీ చూడండి: స్టార్​ హీరోయిన్​ సోదరుడితో ఇలియానా డేటింగ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.