ETV Bharat / entertainment

ఆ తమిళ దర్శకులతో రామ్​చరణ్​, అల్లుఅర్జున్​ కొత్త సినిమా! - Ramcharan new movie

మెగాహీరోలు రామ్​చరణ్, అల్లుఅర్జున్​.. తమ కొత్త సినిమాలను తమిళ దర్శకులు లోకశ్​ కనగరాజ్​, మురగదాస్​తో చేసేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

Ramcharan Lokesh kanagaraj and Alluarjun Murgadoss movie
ఆ తమిళ దర్శకులతో రామ్​చరణ్​, అల్లుఅర్జున్​ సినిమా
author img

By

Published : May 18, 2022, 8:54 PM IST

Lokesh Kanagaraj-Ramcharan movie: దర్శకుడు లోకేశ్​ కనగరాజ్​ - హీరో రామ్​చరణ్​ కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే వార్త గతంలో ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్​ ఊసే లేదు. వీరిద్దరూ ఈ ప్రాజెక్ట్​ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ క్రమంలోనే చరణ్​-శంకర్​, గౌతమ్​ తిన్ననూరితో.. లోకేశ్​- కమల్​హాసన్​తో 'విక్రమ్'​ సినిమాతో బిజీ అయిపోయారు. అయితే తాజాగా వీరిద్దరి కాంబో మళ్లీ తెరపైకి వచ్చింది.

లోకేశ్​.. చరణ్​ కోసం ఓ బైలింగువల్​ స్క్రిప్ట్​ సిద్ధం చేశారని తెలిసింది. రీసెంట్​గా ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ కూడా నడిచిందని సినీవర్గాల టాక్​. మరో రెండు, మూడు సిట్టింగ్స్​లో ఈ ప్రాజెక్ట్​పై క్లారిటీకి వస్తారట. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాగా, లోకేశ్​ తెరకెక్కించిన 'విక్రమ్​' మూవీ జూన్​ 3న విడుదల కానుంది.

Alluarjun Murgadoss movie: 'పుష్ప' సక్సెస్​తో తన కొత్త సినిమాలను పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కించాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు హీరో అల్లుఅర్జున్​. మరోవైపు ఆయనతో సినిమా చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు, స్టార్‌ డైరెక్టర్స్‌ ఆసక్తి కనబరుస్తున్నారు. భారీ పారితోషికాన్ని ఆఫర్​ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయన తదుపరి ప్రాజెక్ట్‌.. లైకా ప్రొడక్షన్స్​ బ్యానర్​లో ఉంటుందని వార్తలు వచ్చాయి. దీనికి మురగదాస్​ లేదా అట్లీ దర్శకత్వం వహించే అవకాశం ముందని కథనాలు వచ్చాయి. అయితే వీరిలో మొదటగా అట్లీకి అవకాశం వచ్చినా.. రెమ్యునరేషన్​ విషయంలో సర్దుబాటు కాక, ఇప్పుడా ఛాన్స్​ మురగదాస్​కు వెళ్లినట్లు తెలిసింది. బన్నీనే అట్లీని సున్నితంగా తిరస్కరించి.. మురగదాస్​కు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

ఇదీ చూడండి: మళ్లీ రిలీజ్‌ కానున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'... తారక్​తో సినిమాపై అనిల్​ రావిపూడి క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.