ETV Bharat / entertainment

'కేజీఎఫ్​-2' హిట్​ టాక్- బాలీవుడ్​పై ఆర్జీవీ హాట్​ కామెంట్స్​​ - kgf chapter 2 release

బాలీవుడ్​లో దక్షిణాది చిత్రాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో హిందీ చిత్ర పరిశ్రమపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ. ఈ సందర్భంగా అక్కడి మార్కెట్లో భారీ స్థాయిలో ఓపెనింగ్ సాధించిన చిత్రాల జాబితాను ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు.

RGV
ఆర్జీవీ
author img

By

Published : Apr 14, 2022, 4:01 PM IST

Updated : Apr 14, 2022, 10:55 PM IST

బంగారు గనుల నేపథ్యంలో రూపుదిద్దుకున్న పవర్‌ప్యాక్డ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కేజీఎఫ్‌’. యశ్‌-ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న ‘కేజీఎఫ్‌-2’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకొంది. మథర్‌ సెంటిమెంట్‌, హీరో ఎలివేషన్స్‌, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లు.. ‘కేజీఎఫ్‌-2’లో ఎన్నో అంశాలు ప్రేక్షకుల్ని ఆకర్షించేలా ఉన్నాయని సినీ ప్రియులు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘కేజీఎఫ్‌-2’ ఓపెనింగ్‌ కలెక్షన్స్‌పై తాజాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. ఈ క్రమంలో ఆయన బాలీవుడ్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు.

  • What do you think the Hindi film industry (aka Bollywood) will be thinking about how a Kannada dubbed film #KGF2 and a Telugu dubbed film #Bahubali2 are the biggest ever openers in the history of Hindi cinema ???😳😳😳 pic.twitter.com/ZChVOqOq8z

    — Ram Gopal Varma (@RGVzoomin) April 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాలీవుడ్‌లో భారీ ఓపెనింగ్స్‌ రాబట్టిన చిత్రాల జాబితా ఫొటోని షేర్‌ చేస్తూ.. "బాలీవుడ్‌ మార్కెట్‌లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ సాధించిన సినిమాల్లో కన్నడ చిత్రమైన 'కేజీఎఫ్‌-2', తెలుగు చిత్రమైన 'బాహుబలి-2' తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దీనిపై బాలీవుడ్‌ ఏం ఆలోచిస్తుందని మీరు భావిస్తున్నారు" అని వర్మ ట్వీట్‌ చేశారు. వర్మ చేసిన ట్వీట్‌ ఇప్పుడు అంతటా వైరల్‌గా మారింది. మరోవైపు దక్షిణాది చిత్రాలకు ఇప్పుడు నార్త్‌లోనూ మంచి మార్కెట్‌ లభిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో చాలా వరకూ తెలుగు చిత్రాలు హిందీలోనూ విడుదల అవుతున్నాయి.

ఇదీ చదవండి: మరిన్ని దేశాల్లో 'ఆర్​ఆర్​ఆర్'​ రిలీజ్​- 'సలార్'​ గ్లింప్స్​ వైరల్​!

Last Updated : Apr 14, 2022, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.