ETV Bharat / entertainment

అమెరికా పర్యటనలో రామ్​చరణ్​.. కాళ్లకి చెప్పులు లేకుండానే.. - Ramcharan America Tour

మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్​కు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఘనతను అందుకోవడానికి ఆయన అమెరికాకు కాళ్లకు చెప్పులు లేకుండానే వెళ్లారు. ఆ సంగతులు..

Ramcharan America Tour
రామ్​చరణ్ అమెరికా టూర్​
author img

By

Published : Feb 21, 2023, 5:24 PM IST

Updated : Feb 21, 2023, 8:49 PM IST

ప్రముఖ టాలీవుడ్​ నటుడు రామ్​చరణ్​ ప్రస్తుతం అమెరికా పర్యటనకు వెళ్లారు. వచ్చే నెల 12న జరగబోయే 95వ ఆస్కార్​ అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరుకానున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే అమెరికాకు చేరుకున్నారు. ఆస్కార్​ పండగకి ఇంకా చాలా సమయం ఉన్నా అప్పుడే చరణ్​ ఎందుకు వెళ్లారనే గుసగుసలు వినపడుతున్నాయి. అయితే ఈ వేడుకకు ముందు మరో అవార్డుల ప్రదానోత్సవంలో కూడా చరణ్​ పాల్గొనబోతున్నారని తెలిసింది. అది కూడా ఆడియన్​గా కాకుండా ప్రెజెంటర్​గా వెళ్లనున్నారు. కాగా, హెచ్​సీఏ పిలుపు అందుకున్న తొలి భారతీయ హీరోగా రామ్​ చరణ్​ నిలిచారు.

ప్రముఖ ఇంగ్లీష్​ మూవీస్ అకాడమీ అయిన హెచ్​సీఏ(హాలీవుడ్​ క్రిటిక్స్​ అసోసియేషన్) రామ్​చరణ్​కు అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది విడుదలైన ఉత్తమ సినిమాలను పలు విభాగాల్లో ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేస్తుంది. అయితే విజేతలకు ఈ అవార్డులను అందించడానికి ప్రజెంటర్​గా రామ్​చరణ్​ను అహ్వానించారు నిర్వాహకులు. ఈ నెల 24న ఈ 6వ హెచ్​సీఏ అవార్డుల ప్రదానోత్స కార్యక్రమం జరగనుంది. ఈ ఈవెంట్​లో ఒక విజేతకు రామ్​చరణ్​ అవార్డును అందించనున్నారు.

ఇకపోతే ఇప్పటికే 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్​ బెస్ట్ ఒరిజినల్​ సాంగ్​ విభాగంలో నామినేట్​ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం గోల్డెన్​ గ్లోబ్​తో పాటు క్రిటిక్స్​ ఛాయిస్​ అవార్డులను కూడా అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా హెచ్​సీఏ ప్రదానం చేయనున్న అవార్డులకు ఆర్​ఆర్​ఆర్​ చిత్రం నామినేట్ అయింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, బెస్ట్​ ఒరిజినల్​ సాంగ్​తో సహా మొత్తం 8 విభాగాల్లో నామినేట్​ అయింది. మరి, నామినేట్​ అయిన ఈ విభాగాల్లో జక్కన్న సినిమా ఎన్ని అవార్డులను సొంతం చేసుకుంటుందో తెలియాలంటే ఫిబ్రవరి 24 వరకు వేచి చూడాల్సిందే.

కాగా, మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్​ ఎయిర్​పోర్టులో రామ్​చరణ్​ కనిపించారు. అయితే ఆయన అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ దీక్షలోనే ఆయన నల్లటి దుస్తుల్లో కాళ్లకి చెప్పులు లేకుండా అమెరికాకు పయనమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోను చూసిన కొందరు ఫ్యాన్స్​ చరణ్​ను సోషల్​ మీడియా వేదికగా పొగడ్తలతో ముంచెత్తున్నారు. రామ్​ చరణ్​ ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో ఎప్పుడూ ముందుంటారని, ఆర్​ఆర్​ఆర్​ మూవీ టీమ్​కు ఆల్​ ది బెస్ట్​​, ఆస్కార్​ ట్రోఫీని గెలుచుకొని రండి, ప్రౌడ్​ ఆఫ్​ రామ్​చరణ్​.. ఇలా ఎవరికి నచ్చిన తీరులో వారు రాసి కామెంట్స్​ పెడుతున్నారు అభిమానులు.

ఇకపోతే.. చివరిసారిగా 2009లో భారత చిత్రం ఆస్కార్​ అవార్డును దక్కించుకుంది. 2008లో విడుదలైన స్లమ్​డాగ్​ మిలియనీర్ సినిమాలోని 'జై హో' పాటను కంపోజ్​ చేసిన ఏఆర్​ రెహమాన్​ సంగీతానికి బెస్ట్​ ఒరిజినల్​ సాంగ్​ విభాగంలో దీనిని అందజేశారు. ఈ సినిమాను డానీ బాయిల్ తెరకెక్కించారు. అలా చాలా కాలం తర్వాత మరో భారత సినిమా ఆస్కార్​ రేసులో నిలవడంతో ఆర్​ఆర్​ఆర్​పై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఆర్​ఆర్ఆర్​తో పాటు ఇండియన్​ ఫిల్మ్​ మేకర్స్​.. షౌనక్ సేన్ డైరెక్ట్​ చేసిన 'ఆల్​ దట్​ బ్రీత్స్'​, గునీత్​ మోంగా డైరెక్ట్​ చేసిన 'ది ఎలిఫెంట్​ విస్పర్స్'​లు ఉత్తమ​ డాక్యూమెంటరీ ఫీచర్​ ఫిల్మ్​ కేటగిరీలో ఆస్కార్​ రేసులో ఉన్నాయి.

Last Updated : Feb 21, 2023, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.