ETV Bharat / entertainment

Nikhil Ram Charan Movie : నిఖిల్ కోసం రామ్​ చరణ్​ మూవీ.. గ్లింప్స్​ అదుర్స్​! - రామ్​చరణ్​ ది ఇండియా హౌస్​ మూవీ

టాలీవుడ్​ మెగా పవర్ స్టార్ రామ్​ చరణ్ తేజ్ ఇటీవలే ఓ కొత్త ప్రొడక్షన్​ హౌస్​ను ప్రారంభించారు. ఇందులో భాగంగా తన మొదటి సినిమాను హీరో నిఖిల్​తో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు మీ కోసం..

nikhil ram charan new movie
nikhil ram charan movie
author img

By

Published : May 28, 2023, 1:51 PM IST

Nikhil Ram Charan Movie : గ్లోబల్​ స్టార్​ రామ్​ చరణ్​ ఇటీవలే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రొడ్యుసర్ విక్రమ్ రెడ్డితో కలిసి 'వి మెగా పిచర్స్' అనే బ్యానర్‌ను లాంచ్ చేశారు. ఈ క్రమంలో తన ప్రొడక్షన్​ హౌస్​ నుంచి వస్తున్న తొలి చిత్రం గురించి ఆదివారం అనౌన్స్​ చేశారు. తను ప్రొడ్యూస్​ చేస్తున్న తొలి సినిమాలో నిఖిల్‌ సిద్ధార్థ హీరోగా నటిస్తున్నారని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా 'ది ఇండియా హౌస్' చిత్రాన్ని అనౌన్స్ చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేసిన ఆయన..సినిమాకు సంబధించిన గ్లింప్స్​ను ట్విట్టర్​ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

  • On the occasion of the 140th birth anniversary of our great freedom fighter Veer Savarkar Garu we are proud to announce our pan India film - THE INDIA HOUSE
    headlined by Nikhil Siddhartha, Anupam Kher ji & director Ram Vamsi Krishna!
    Jai Hind!@actor_Nikhil @AnupamPKherpic.twitter.com/YYOTOjmgkV

    — Ram Charan (@AlwaysRamCharan) May 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

The India House Glimpse : లండన్ నేపథ్యంలో, భారత్​కు స్వతంత్య్రం రాక మందు కాలంలో జరిగిన ఘటనల ఆధారంగా 'ది ఇండియా హౌస్' తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరో నిఖిల్.. శివ అనే పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్‌ వంశీకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్​ అనుపమ్​ ఖేర్​ నటిస్తున్నారు. శ్యామ్ జీ కృష్ణ వర్మ అనే కీలక పాత్రను అనుపమ్​ పోషిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్, అభిషేక్ అగర్వాల్ కూడా రామ్​ చరణ్​తో పాటు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Nikhil Movies : నిఖిల్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. 'కార్తికేయ 2' సక్సెస్​ను ఆస్వాదిస్తున్న ఆయన​.. ఆ తర్వాత '18 పేజెస్' అనే సినిమాతోనూ మంచి టాక్​ అందుకున్నారు. త్వరలో 'స్పై' అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 'కార్తికేయ 2' తర్వాత నిఖిల్, అనుపమ్ ఖేర్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్.. మరోసారి ఈ సినిమా కోసం కలిసారు.

Ram Charan Movies: మరోవైపు రామ్​ చరణ్​ కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 'ఆర్ఆర్​ఆర్​' తర్వాత ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న 'గేమ్​ ఛేంజర్' అనే సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్​లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్​ దశలో ఉంది. పొలిటికల్​ బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్​ చరణ్​ డిఫరెంట్​ రోల్స్​లో కనిపించనున్నట్లు టాక్​. ఇందులో రామ్​ చరణ్​ సరసన కియారా అడ్వాణీ, అంజలి నటిస్తున్నారు. వీరితో పాటు ఎస్‌జే సూర్య, నవీన్​ చంద్ర, సునీల్ లాంటి స్టార్స్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్​ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.