ETV Bharat / entertainment

సుకుమార్ కథకు ప్రభాస్​ గ్రీన్​ సిగ్నల్​.. కన్నడ దర్శకుడికి రామ్​ చరణ్​ ఓకే! - రామ్​ చరణ్​ రాబోయే సినిమాలు

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​, మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్​ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా ఈ ఇద్దరు హీరోలు కొత్త సినిమాలకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారట. రామ్​చరణ్​ ఓ కన్నడ కథను ఓకే చేశారట. మరోవైపు, ప్రభాస్​.. సుకుమార్​తో సినిమా చేస్తున్నారని తెలుస్తోంది.

ram charan and prabhas up coming movies
ram charan and prabhas up coming movies
author img

By

Published : Dec 26, 2022, 10:55 PM IST

మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్ మరో క్రేజీ ప్రాజెక్టుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్​ తెరకెక్కిస్తున్న ఆర్​సీ 15లో నటిస్తున్న రామ్​చరణ్.. యువ దర్శకుడు బుచ్చిబాబుతో కుడా ఓ ప్రాజెక్టుకు ఓకే చెప్పారు. తాజాగా మరో కథకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారట. కన్నడ ఇండస్ట్రీలో 'మఫ్టీ' లాంటి హిట్ సినిమా తెరకెక్కించిన దర్శకుదడు నర్తన్ కథకు ఓకే చెప్పారట. నర్తన్..​ రామ్​ చరణ్​తో ఓ భారీ సినిమా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు పని నడుస్తోందని టాక్​ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ మేరకు కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రభాస్​తో లెక్కల మాస్టర్..
పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. బాలీవుడ్​ దర్శకుడు ఓం రౌత్​ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్​ సినిమాను పూర్తి చేశారు. కేజీఎఫ్​ లాంటి హిట్​ చిత్రాలు అందించిన ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో ప్రభాస్​ నటిస్తున్న.. సలార్​ చిత్రీకరణ కూడా వేగంగా జరుగుతోంది. కాగా, రెబల్​ స్టార్.. మారుతి దర్శకత్వంలో రాజాడీలక్స్​ అనే సినిమా చేస్తున్నారు.

ఇక డైరెక్టర్​ నాగ్​ అశ్విన్​ దర్శకత్వంలో దాదాపు రూ. 500 కోట్ల బారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్​ కేలో నటిస్తున్నారు. వీటితో పాటు ప్రభాస్​ మరో సినిమాకు కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సెన్సేషనల్​ డైరెక్టర్ సుకుమార్​తో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. ప్రభాస్​కు.. సుకుమార్ ఇప్పటికే ఓ కథను కూడా వినిపించినట్లు టాక్ నడుస్తోంది. ప్రభాస్ కూడా ఫుల్ స్క్రిప్ట్​ రెడీ చేయమన్నట్లు సమాచారం. ప్రస్తుతం సుకుమార్.. పుష్ప2 షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత రామ్ చరణ్​తో మరొక చిత్రం చేయనున్నారు. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.