ETV Bharat / entertainment

Rajinikanth Yogi Feet : యోగి కాళ్లు మొక్కడంపై రజనీ రియాక్షన్​​.. అందుకే అలా చేశానంటూ.. - జైలర్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Rajinikanth Yogi Feet : తాను ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​కు పాదాభివందనం చేయడంపై వస్తున్న విమర్శలకు స్పందించారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఏమన్నారంటే?

Rajinikanth Yogi Feet
Rajinikanth Yogi Feet : యోగి ఆదిత్యనాథ్​ కాళ్లు మొక్కడంపై రజనీ రియాక్షన్​.. అందుకే అలా చేశానంటూ..
author img

By

Published : Aug 22, 2023, 9:18 AM IST

Updated : Aug 22, 2023, 11:50 AM IST

Rajinikanth Yogi Feet : సూపర్ స్టార్ రజినీకాంత్.. గత కొద్ది రోజులుగా సోషల్​మీడియా, టెలివిజన్ మీడియాలో హాట్​టాపిక్​గా ఉంటున్న సంగతి తెలిసిందే. కాంట్రవర్సీలకు కూడా గురౌతున్నారు. ప్రస్తుతం ఆయన దేశమంతా తిరుగుతూ 'జైలర్​' సినిమా విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రితో కలిసి రాంచీలో చిత్రాన్ని వీక్షించిన ఆయన.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్‌ మౌర్యతోనూ కలిసి సినిమా చూశారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ను కలిసిన రజనీ.. ఆ సమయంలో యోగికి పాదాభివందనం కూడా చేశారు.

Rajinikanth Yogi Adityanath : అయితే ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా తమిళ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు రజనీ. యోగీ కాళ్లు మొక్కడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. రజనీ అలా చేయడాన్ని తప్పుపడుతున్నారు. అయితే తాజాగా తనపై వస్తున్న విమర్శలకు సూపర్ స్టార్​ స్పందించారు.

"యోగి, సన్యాసీల పాదాలను తాకి, వారి ఆశీర్వాదాలను తీసుకోవడం నా అలవాటు. నాకన్నా చిన్నవారైనా ఇలానే చేస్తాను. అదే ఇప్పుడు కూడా చేశాను" అంటూ తాను చేసిన పనిని సమర్థించుకున్నారు. అలాగే 2024లో తమిళనాడులో జరగబోయే లోక సభ ఎలెక్షన్స్​ గురించి అడగగా.. తాను ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడనుకోవట్లేదని పేర్కొన్నారు.

Jailer World Wide Collections : ఇకపోతే రజనీకాంత్​ చాలా కాలం తర్వాత 'జైలర్'​ చిత్రంతో మళ్లీ ఫామ్​లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. విడుదలైన10 రోజుల్లోనే రూ.500కోట్లు క్రాస్ చేసి రూ.600కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఇంకా థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా రన్​ అవుతోంది. ఈ చిత్రంలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్​లో మెరవగా.. కన్నడ సూపర్​ స్టార్​ శివ రాజ్​కుమార్​, మలయాళ మెగాస్టార్ మోహన్​ లాల్​ పవర్​ఫుల్​ క్యారెక్టర్స్​లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక టాలీవుడ్ సీనియర్ కమెడియన్ సునీల్​ తన మార్క్ కామెడీతో బాగా నవ్వించారు. అనిరూధ్ కూడా తన మార్క్​ మ్యూజిక్​తో రజనీ పాత్రను బాగా ఎలివేట్​ చేస్తూ సినిమాకే హైలట్​గా నిలిచారు.

Rajinikanth Meets Yogi Adityanath : యోగిని కలిసిన సూపర్​స్టార్.. నేడు అయోధ్య రామయ్య దర్శనానికి రజనీ

Rajinikanth Ram Mandir Ayodhya : 'ఎన్నో ఏళ్ల కోరిక నెరవేరింది'.. అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన రజినీకాంత్​

Last Updated : Aug 22, 2023, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.