ETV Bharat / entertainment

'అదే సూపర్​ స్టార్​ రజనీ ఆఖరి సినిమా'.. స్టార్​ డైరెక్టర్ కామెంట్స్​ వైరల్ - రజనీని కలిసిన కపిల్ దేవ్

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు గుడ్​బై చెప్పనున్నారా? ఆయన ఆఖరి సినిమా అదేనా?. దర్శకుడు మిస్కిన్ మాటల్లో అంతర్యమేంటి?.

rajinikanth last movie
rajinikanth last movie
author img

By

Published : May 19, 2023, 2:17 PM IST

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తనదైన స్టైల్​, మేనరిజంతో అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ప్రతి సినిమాలోనూ నటనతోనే కాదు ఏదో ఒక ప్రత్యేకమైన స్టైల్‌, పంచ్‌ డైలాగులతో అలరిస్తుంటారు రజనీ. ఏడు పదుల వయసులోనూ కుర్ర హీరోలతో పోటీపడుతుంటారు. 170కి పైగా సినిమాల్లో నటించిన రజనీకాంత్​ మరికొన్ని రోజుల్లో సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారట. ఇప్పుడీ వార్త ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. సోషల్‌ మీడియా వేదికగా దీనిపై రకరకాల కామెంట్స్‌ వస్తున్నాయి.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌పై ప్రముఖ తమిళ దర్శకుడు మిస్కిన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రజనీ సినిమా చేస్తున్నట్లు మిస్కిన్‌ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో నటించాలని సూపర్​స్టార్​ రజనీ ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా గురించి రజనీయే స్వయంగా లోకేశ్‌ కనకరాజ్​ను అడిగారు. బహుశా ఇదే రజనీకాంత్‌కు చివరి సినిమా కావచ్చు' అని మిస్కిన్ అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'తలైవా ఇలాంటి నిర్ణయం తీసుకోరు'.. 'రజనీపై ఇలాంటి ప్రచారాలు ఆపండి' అని రజనీకాంత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

అయితే రజనీకాంత్​ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారనే వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. 'బాబా' సినిమా వచ్చిన సమయంలోనూ ఆయన సినిమాలకు గుడ్​బై చెప్తారనే వార్తలు వచ్చాయి. దాని తర్వాత మూడేళ్లు విరామం తీసుకున్న రజనీ.. 2005లో చంద్రముఖి సినిమాలో తన మార్క్‌ నటన చూపించి సూపర్‌ హిట్‌ అందుకున్నారు. అప్పటి నుంచి వరుస చిత్రాలతో తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా మిస్కిన్‌ వ్యాఖ్యలతో మరోసారి రజనీ చివరి సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి.
ప్రస్తుతం సూపర్ స్టార్ రడనీకాంత్​ త్వరలోనే 'జైలర్‌'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక దీని తర్వాత స్టార్ డైరెక్టర్​ లోకేశ్‌ కనకరాజ్‌ సినిమాలో రజనీకాంత్‌ నటించే అవకాశం ఉంది.

రజనీ-కపిల్ జోడీ..
రజనీకాంత్‌ కీలక పాత్రలో ఆయన కుమార్తె ఐశ్వర్య తెరకెక్కిస్తున్న చిత్రం 'లాల్‌ సలాం'. విష్ణు విశాల్‌ హీరో. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ యాక్షన్‌ చిత్రంలో మొయిద్దీన్‌ భాయ్‌గా రజనీ సందడి చేయనున్నారు. కాగా ఈ సినిమాలో భారత లెజెండరీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలో కపిల్‌ పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని సూపర్​స్టార్ రజనీకాంత్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.