ETV Bharat / entertainment

రాజమౌళికి స్పీల్​బర్గ్ కాంప్లిమెంట్..​ పట్టలేని ఆనందంలో జక్కన్న.. - ​ రాజమౌళికి స్పీల్​బర్గ్​ ప్రశంస

హాలీవుడ్​ దర్శకుడు స్టీవెన్ స్పీల్​బర్గ్​ ఇచ్చిన ప్రశంసకు దిగ్గజ దర్శకుడు రాజమౌళి పొంగిపోయారు. కుర్చీలోంచి లేచి డ్యాన్స్​ చేయాలనుందని ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఆన్​లైన్​లో స్పీల్​బర్గ్​ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా స్పీల్​బర్గ్​ యంగ్​ ఫిల్మ్​ మేకర్స్​కు ఓ సలహా ఇచ్చారు. అదేంటంటే..

steven spielberg rajamouli interview
steven spielberg rajamouli interview
author img

By

Published : Feb 10, 2023, 10:24 PM IST

హాలీవుడ్​ దిగ్గజ దర్శకుడు స్పీల్​బర్గ్​ను ఎస్​ఎస్​ రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా స్పీల్​ బర్గ్ ఇచ్చిన కాంప్లిమెంట్​కు రాజమౌళి పొంగి పొయారు. అనంతరం కుర్చీలోంచి లేచి డ్యాన్స్​ చేయాలనిపిస్తోందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఆస్కార్‌కు ఉత్తమ చిత్రంగా నామినేట్‌ అయింది స్పీల్‌బర్గ్‌ సినిమా 'ది ఫేబుల్‌మ్యాన్స్‌'. ఈ చిత్రం భారత్​లో శుక్రవారం విడుదలైంది. ఈ నేపథ్యంలో స్పీల్​బర్గ్​, రాజమౌళి ఆన్‌లైన్‌లో సరదాగా ముచ్చటించారు. 1976లో వచ్చిన 'క్లోజ్‌ ఎన్‌కౌంటర్స్‌ ఆఫ్‌ ది థర్డ్‌ కైండ్‌' సినిమా షూటింగ్‌ కోసం భారతదేశం వచ్చానని, ముంబయి సమీపంలో కొన్ని రోజులు చిత్రీకరించామని స్పీల్‌బర్గ్‌ గుర్తు చేసుకున్నారు. ఇంటర్వ్యూ సాగిందిలా..

స్పీల్‌బర్గ్‌: హాయ్‌! ఎస్‌. ఎస్‌ ఎలా ఉన్నారు?
రాజమౌళి: చాలా బాగున్నా సర్‌. మిమ్మల్ని చూడడం, మీతో మాట్లాడడం ఓ గౌరవం.
స్పీల్‌బర్గ్‌: మీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా నన్నెంతగానో ఆకట్టుకుంది. దాన్ని చూస్తున్నంత సేపూ నా కళ్లను నేను నమ్మలేకపోయా. అందులోని ప్రతి పాత్రా ప్రత్యేకంగా నిలిచింది. విజువల్స్‌, టేకింగ్‌ అత్యద్భుతం.
రాజమౌళి: థ్యాంక్‌ యు సర్‌. మీరు మా చిత్రాన్ని చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీరిచ్చిన ప్రశంసకు ఇప్పుడే కుర్చీలో నుంచి లేచి డ్యాన్స్‌ చేయాలనిపిస్తోంది. 'ది ఫేబుల్‌మ్యాన్స్‌' మీ గత చిత్రాలన్నింటికీ భిన్నంగా ఉంటుంది. అది మీ ఆటోబయోగ్రఫీ అని చాలామందికి తెలియదు. మీ వ్యక్తిగతం గురించే కాకుండా మీ తల్లిదండ్రుల గురించీ ప్రపంచానికి తెలిసేలా చేశారు.
స్పీల్‌బర్గ్‌: 'ఇప్పటి వరకు ఇతరుల కథను చెప్పా. నా గురించి ఏం చెప్పాలి' అన్న ఆలోచనలో భాగంగా 'ది ఫేబుల్‌మ్యాన్స్‌' వచ్చింది. నా పేరెంట్స్‌, సిస్టర్స్‌ గురించీ, నేను ఎదిగే క్రమంలో ఎదుర్కొనవన్నీ నిజాయతీగా చెప్పాలనిపించింది. మా అమ్మది చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం. ఆవిడ గురించి ఎక్కువగా ప్రస్తావించా.
రాజమౌళి: క్లైమాక్స్‌కు ముందు వచ్చే ఓ సన్నివేశం హృదయాన్ని కలచివేస్తుంది. ఆ షాట్‌ గురించి వివరిస్తారా?
స్పీల్‌బర్గ్‌: నా లైఫ్‌లో ఎంతో డ్రామా ఉంది. నా చిన్నప్పుడు మా కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే. బాల్యంలో నాకు ఓ కెమెరా ఉండేది. దానితోనే సినిమా తీయాలని కలలు కంటుండేవాణ్ని. నేను పడిన ఇబ్బందినే సినిమాలో సాముయేల్‌ పాత్ర పోషించింది.
రాజమౌళి: ఈ చిత్రంలో సీనియర్‌ నటులేకాదు యంగ్‌ యాక్టర్స్‌ కూడా వావ్‌ అనిపించేలా చేశారు.

స్పీల్‌బర్గ్‌: తమ గత చిత్రాల్లోని ప్రదర్శనను చూసి కొంతమంది యువ నటులను తీసుకున్నా. పాత్రకు ఎవరైతే న్యాయం చేయగలుగుతారో వారినే ఎంపిక చేశా.
రాజమౌళి: 'ది ఫేబుల్‌మ్యాన్స్‌'కు కొనసాగింపుగా మరిన్ని చిత్రాలను ఆశించొచ్చా?
స్పీల్‌బర్గ్‌: ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదు.
రాజమౌళి: యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌కు మీరిచ్చే సలహా?
స్పీల్‌బర్గ్‌: ప్రస్తుతం ఫోన్‌లోనే సినిమా చిత్రీకరించే టెక్నాలజీ అందుబాటులో ఉంది. యంగ్‌ ఫిల్మ్‌మేకర్స్‌ తమని తాము నిరూపించుకోవాలంటే బడ్జెట్‌, చిత్రీకరణ షెడ్యూల్స్‌పై స్పష్టత కలిగి ఉండాలి. తమ సినిమాకు పనిచేసే అనుభవం ఉన్న నటులు, సాంకేతిక నిపుణులు చెప్పే విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా వినాలి. సినిమా అంటే సమష్టి కృషి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.