ETV Bharat / entertainment

'తారక్.. కనుబొమ్మలతోనూ నటిస్తాడు- నేను డైరెక్ట్ చేసిన బెస్ట్ సీన్లు అవే' - tarak or ram charan rrr

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​ను దర్శకధీరుడు రాజమౌళి ఆకాశానికి ఎత్తేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తాను డైరెక్ట్ చేసిన సినిమాల్లోని అత్యంత ఉత్తమమైన సీన్ల గురించి చెప్పారు.

RAJAMOULI TARAK
RAJAMOULI TARAK
author img

By

Published : Jan 8, 2023, 7:16 PM IST

రాజమౌళి- జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న బాండింగ్ ఎలాంటిదో సినీ ప్రియులందరికీ తెలుసు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ విషయం సాధారణ జనానికీ తెలిసిపోయింది. ప్రచార కార్యక్రమాల్లో ఇద్దరు కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక రాజమౌళికి కూడా తారక్ అంటే ప్రత్యేక అభిమానం. పలు ఇంటర్వ్యూలలో తనకు నచ్చిన యాక్టర్ ఎవరని అడిగితే.. తారక్ అనే చెప్పారు జక్కన్న. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ సాధించిన విజయాన్నీ ఈ చిత్రబృందం ఎంజాయ్ చేస్తోంది.

అమెరికా, లాస్ఏంజిలిస్​లోని డీజీఏ థియేటర్​లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి, తారక్.. అక్కడ నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంటర్వ్యూలో భాగంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో నచ్చిన పాట ఏదని విలేకర్లు రాజమౌళిని అడిగారు. గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ అందుకొని.. ఆస్కార్ ప్రధాన నామినేషన్ల దిశగా దూసుకెళ్తున్న నాటునాటు పాట అంటేనే ఇష్టమా అని ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన రాజమౌళి.. తారక్​ను ఆకాశానికి ఎత్తేశారు.

"నాటునాటు కాదు. నాకు నచ్చిన పాట కొమురం భీముడో. తారక్ నటించిన కొమురం భీముడో పాట నా అన్ని సినిమాల్లోకెల్లా ఉత్తమమైన పాట. తారక్ నటించిన సీన్లు.. నేను డైరెక్ట్ చేసిన అత్యంత బెస్ట్ సీన్లు. నేను కెమెరాను తారక్ కనుబొమ్మలపై పెట్టినా.. వాటితోనే ఆయన పర్ఫార్మ్ చేస్తారు. అంత గొప్పగా నటించే వ్యక్తి తారక్."
-రాజమౌళి, దర్శకుడు

అంతర్జాతీయంగా ఆర్ఆర్ఆర్ సినిమా అంచనాలను మించి ఆకట్టుకుంటోంది. చిత్ర దర్శకుడు రాజమౌళితో పాటు యాక్టర్స్ రామ్​చరణ్, ఎన్టీఆర్​లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. నాటునాటు పాటను వెస్ట్రన్ ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఆస్కార్, బాఫ్టా, గోల్డెన్ గ్లోబ్ వంటి అవార్డుల రేసులోనూ చిత్రం దూసుకెళ్తోంది. ఇటీవలే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు రాజమౌళి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.